తెలంగాణ

telangana

ETV Bharat / city

నూతన రెవెన్యూ బిల్లుపై సీఎం కేసీఆర్​ స్పీచ్​లోని ముఖ్యాంశాలు - అసెంబ్లీలో సీఎం కేసీఆర్​ స్పీచ్

cm kcr
cm kcr

By

Published : Sep 11, 2020, 4:17 PM IST

Updated : Sep 11, 2020, 6:50 PM IST

18:06 September 11

నూతన రెవెన్యూ చట్టాన్ని ఏకగ్రీవంగా ఆమోదించిన శాసనసభ

  • తెలంగాణ భూమి హక్కులు, పట్టాదారు పాస్‌బుక్‌ల బిల్లు-2020కు ఆమోదం
  • ఎలాంటి సవరణలు లేకుండానే బిల్లును ఆమోదించిన శాసనసభ
  • తెలంగాణ గ్రామ అధికారుల పదవుల రద్దు బిల్లు-2020 ఆమోదం 
  • పంచాయతీరాజ్‌ చట్ట సవరణ బిల్లుకు శాసనసభ ఆమోదం
  • పురపాలక నియమాల సవరణ బిల్లుకు ఆమోదం
  • రెవెన్యూ బిల్లు ఆమోదంతో కేసీఆర్‌ను అభినందించిన మంత్రులు, ఎమ్మెల్యేలు
  • శాసనసభలో విజయచిహ్నం ప్రదర్శించిన సీఎం కేసీఆర్‌ 

17:42 September 11

తెలంగాణ భూమి హక్కులు, పట్టాదారు పాస్‌బుక్‌ల బిల్లు-2020కు ఆమోదం

అధికారి తప్పు చేస్తే ఉద్యోగం పోతుంది : కేసీఆర్

  • రైతులకు లాభం చేసేందుకే మార్పు: సీఎం కేసీఆర్‌
  • ఏళ్ల తరబడి ఒకటే రకం పంటలు పండించి నష్టపోవద్దు: సీఎం
  • మక్కలకు ధర లేదు... మొక్కజొన్న వద్దని రైతులకు చెప్పాం: సీఎం కేసీఆర్‌
  • లక్ష ఎకరాలు మాత్రమే మొక్కజొన్న సాగు చేశారు: సీఎం
  • మొక్కజొన్న స్థానంలో కందిసాగు పెరిగింది: సీఎం కేసీఆర్‌
  • వ్యవసాయంలో నియంత్రిత సాగుతో రైతులకు లాభం: సీఎం
  • వ్యవసాయేతర భూములు ఎప్పటికీ వ్యవసాయభూములు కావు: సీఎం
  • వ్యవసాయ భూములకు ఆకుపచ్చ పాస్‌బుక్‌: సీఎం కేసీఆర్‌
  • వ్యవసాయేతర భూములకు ముదురు ఎరుపు పాస్‌బుక్‌: సీఎం
  • అధికారి తప్పు చేస్తే ఉద్యోగం నుంచి తొలగింపు అనేది చట్టంలో పొందుపరిచాం: సీఎం

17:20 September 11

పంపిణీ చేసేందుకు ప్రభుత్వభూమే లేదు: సీఎం కేసీఆర్‌ 

  • పంపిణీ చేసేందుకు ప్రభుత్వభూమే లేదు: సీఎం కేసీఆర్‌
  • భూములు పంపిణీ చేస్తామని అసత్యాలు చెప్పం: సీఎం కేసీఆర్‌
  • భూములు క్రమబద్దీకరణ చేసి అందరికీ న్యాయం చేస్తాం: సీఎం
  • కౌలుదారి వ్యవస్థను పట్టించుకోం: సీఎం కేసీఆర్‌
  • రైతులకు అండదండగా ఉండటమే మా పాలసీ: సీఎం కేసీఆర్‌
  • వీఆర్వో వ్యవస్థ రద్దుతో ప్రజలు సంబురాలు చేసుకున్నారు: సీఎం కేసీఆర్‌
  • ఒకప్పుడు ప్రభుత్వానికి భూమిశిస్తు ప్రధాన ఆదాయ వనరు: సీఎం కేసీఆర్‌
  • ఇప్పుడు భూమిశిస్తు రద్దు చేశాం: సీఎం కేసీఆర్‌
  • ప్రభుత్వమే రైతుబంధు అందిస్తున్నప్పుడు అనుభవదారు కాలం అవసరమే లేదు: సీఎం
  • జాగీర్దార్ల వ్యవస్థ ఉన్నప్పుడు అనుభవదారు కాలం సరైనదే: సీఎం కేసీఆర్‌
  • ఇప్పుడు అనుభవదారు కాలంతో సన్న,చిన్నకారు రైతులకు నష్టం: సీఎం కేసీఆర్‌

17:01 September 11

  • ఆర్వోఎఫ్‌ఆర్‌ భూములు రక్షిస్తాం: సీఎం కేసీఆర్‌
  • ఇప్పటికే పట్టాలు పొందిన గిరిజనుల జోలికి వెళ్లం: సీఎం కేసీఆర్‌
  • పేదలను కాపాడటంలో దేశంలోనే తెలంగాణ ప్రథమ స్థానంలో ఉంది: సీఎం కేసీఆర్‌
  • జీవో 58, 59 కాలపరిమితి మరోసారి పొడగింపు: సీఎం కేసీఆర్‌

16:48 September 11

రేపటి నుంచే వక్ఫ్‌ భూముల్లో లావాదేవీలు నిషేధం: సీఎం కేసీఆర్‌ 

  • 1962 నుంచి 2013 వరకు వక్ఫ్‌ భూముల సర్వేలు చేశారు... గెజిట్లు ఇచ్చారు: సీఎం
  • వక్ఫ్‌ భూములు 55వేల ఎకరాలు ఆక్రమణలో ఉన్నాయి: సీఎం కేసీఆర్‌
  • 87వేల ఎకరాల దేవాదాయ భూముల్లోనూ ఆక్రమణలు ఉన్నాయి: సీఎం కేసీఆర్‌
  • దేవాదాయ, వక్ఫ్‌ భూములు రక్షిస్తాం: సీఎం కేసీఆర్‌
  • రేపటి నుంచే వక్ఫ్‌ భూముల్లో లావాదేవీలు నిషేధం: సీఎం కేసీఆర్‌
  • అటవీ భూముల్లోనూ రాజకీయదందానే చేశారు: సీఎం కేసీఆర్‌
  • వక్ఫ్‌భూముల రిజిస్ట్రేషన్లు, గ్రామపంచాయతీ, పురపాలికల్లో అనుమతులు నిలిపివేస్తాం: సీఎం
  • ధరణి పోర్టల్‌లో అటవీ భూములకు ప్రత్యేక కాలమ్‌: సీఎం కేసీఆర్‌

16:34 September 11

ఎన్నికలు వస్తేనే

  • ఎన్నికలు వచ్చాయంటే చాలు పట్టాల పంపిణీ చేపట్టారు: సీఎం కేసీఆర్‌
  • స్థలాలు చూపకుండానే పట్టాలు పంపిణీ చేశారు: సీఎం కేసీఆర్‌
  • హద్దులు చూపకుండా భూముల పట్టాలు ఇచ్చారు: సీఎం కేసీఆర్‌
  • పంచిన భూమి తక్కువ... పట్టా కాగితాలే ఎక్కువ: సీఎం కేసీఆర్‌
  • అశాస్త్ర్రీయంగా చేసిన భూపంపిణీ సమస్యలే ఎక్కువ: సీఎం కేసీఆర్‌
  • సర్వేతోనే సమస్యల పరిష్కారం: సీఎం కేసీఆర్‌

16:25 September 11

సర్వేనే సరైన మార్గం

  • 57లక్షల90వేల మంది రైతులకు రైతుబంధు అందిస్తున్నాం: సీఎం కేసీఆర్‌
  • కేవలం 48 గంటల్లో 7,200కోట్లు రైతులకు అందించాం: సీఎం కేసీఆర్‌
  • రైతుబంధు పరిహారం ఒకరిది ఒకరికి వెళ్లిందా అనే అంశంపై విచారణ చేయించాను: సీఎం
  • ఒకరి పరిహారం ఇంకొకరికి వెళ్తే చాలా గొడవలు జరిగేవి: సీఎం కేసీఆర్‌
  • కోటి 48లక్షల57వేల ఎకరాలకు రైతుబంధు అందజేశాం: సీఎం కేసీఆర్‌
  • రైతుబంధు పథకం పరిశీలిస్తే వివాదాల్లో ఉన్న భూములు చాలా తక్కువ: సీఎం
  • సమగ్ర సర్వేనే సరైన సమాధానం: సీఎం కేసీఆర్‌
  • భూముల వివాదాల పరిష్కారానికి సర్వేనే సరైన మార్గం: సీఎం కేసీఆర్‌
  • సమస్యల పరిష్కారంలో పాలకులు ప్రేక్షకపాత్ర వహిస్తే నేరం అవుతుంది: సీఎం
  • రెండు లేదా మూడు మినహా మిగిలిన చట్టాలు తీసి వేయడం లేదు: సీఎం
  • గతంలో అవలంభించిన విధానం అశాస్త్రీయంగా ఉంది: సీఎం కేసీఆర్‌
  • గతంలో అవలంభించిన భూ విధానం అశాస్త్రీయంగా ఉంది: సీఎం కేసీఆర్‌

14:54 September 11

నూతన రెవెన్యూ చట్టం అంతం కాదు... ఆరంభం మాత్రమే: సీఎం కేసీఆర్‌

  • నూతన రెవెన్యూ చట్టంపై సీఎం కేసీఆర్‌ వివరణ
  • నూతన రెవెన్యూ చట్టంపై సభ్యుల సలహాలు స్వీకరిస్తాం: కేసీఆర్‌
  • సభ్యులు అందరూ ఉత్తమమైన సలహాలు ఇచ్చారు: సీఎం
  • పలు చట్టాల సమాహారంగా రెవెన్యూ చట్టం కొనసాగుతుంది: కేసీఆర్‌
  • సమైక్య రాష్ట్రంలో 160 నుంచి 170 వరకు చట్టాలు ఉండేవి: సీఎం
  • ప్రస్తుతం తెలంగాణలో 87 చట్టాలు ఉన్నాయి: సీఎం కేసీఆర్‌
  • ధరణి మాత్రమే కాదు మిగతా చట్టాలు ఉంటాయి: సీఎం కేసీఆర్‌
  • రెవెన్యూ చట్టంలోని అన్ని అంశాలను తొలగించడం లేదు: సీఎం
  • ప్రజలకు ఇబ్బంది కలిగించే అంశాలను మాత్రమే తొలగిస్తున్నాం: సీఎం
  • నూతన రెవెన్యూ చట్టం అంతం కాదు...ఆరంభం మాత్రమే: సీఎం కేసీఆర్‌
  • రెవెన్యూ సంస్కరణల్లో ఇది తొలి అడుగు: సీఎం కేసీఆర్‌
  • ప్రజలకు ఇబ్బంది కల్గించే అంశాలపై ప్రధానంగా దృష్టిసారించాం: సీఎం
  • గ్రామాల్లో ఎవరి జీవితంవారే సాగిస్తున్నారు: సీఎం కేసీఆర్‌
  • గ్రామాల్లో వివాదం ఉన్నవి చాలా తక్కువ: సీఎం కేసీఆర్‌ 
Last Updated : Sep 11, 2020, 6:50 PM IST

ABOUT THE AUTHOR

...view details