పౌరసత్వ సవరణ చట్టాన్ని పునఃసమీక్షించాలంటూ అసెంబ్లీలో సీఎం కేసీఆర్ తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. దేశంలో ఎన్నో సమస్యలుంటే సీఏఏపై మోదీ సర్కారుకు అంత మొండివైఖరి ఎందుకని సీఎం ప్రశ్నించారు. పార్లమెంటులో బిల్లును తాము వ్యతిరేకించినట్టు గుర్తుచేశారు. ఓటరు కార్డు సీఏఏకి పనికిరాదని అనడం హాస్యాస్పదమని అన్నారు.
నాకే పుట్టినరోజు ధ్రువీకరణ పత్రం లేదు.. మా నాన్నది ఎక్కడ తేవాలి. నా పరిస్థితే ఇలా ఉంటే సామాన్యుల పరిస్థితి ఏంటి. ఇది కోట్లాది మంది ప్రజల సమస్య.. కేంద్రం సమాధానం చెప్పాలి. విభజన రాజకీయాలు ఈ దేశానికి అవసరమా? చొరబాటుదారులను అనుమతించాలని ఎవరూ చెప్పరు. భారతదేశంలో కూడా సరిహద్దు చుట్టూ గోడ కడతారా? ఎవరైనా మాట్లాడితే దేశద్రోహి, పాకిస్తాన్ ఏజెంట్ అని విమర్శిస్తారు. కొత్త ప్రతిపాదనతో ముందుకు వస్తే మద్దతు ఇచ్చే అంశంపై ఆలోచిస్తాం.
- సీఎం కేసీఆర్
సంబంధిత కథనాలు:విభజన రాజకీయాలు దేశానికి అవసరమా: సీఎం కేసీఆర్
విభేదాలు సృష్టించేదుకే
సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన తీర్మానాన్ని ఎంఐఎం స్వాగతించింది. ఆ చట్టం దేశ ప్రజల్ని విడదీసేలా ఉందని అక్బరుద్దీన్ ఒవైసీ ఆరోపించారు. సీఏఏ ముస్లింలకు వ్యతిరేకంగా ఉందన్నారు. ఈ చట్టంతో దిల్లీ, ఉత్తరప్రదేశ్‌లో అనేక మంది అమాయకులు ప్రాణాలు కోల్పోయారని గుర్తుచేశారు. కలిసి ఉన్న ప్రజల మధ్య విభేదాలు సృష్టించినట్లైందని విమర్శించారు. ఎన్‌పీఆర్, ఎన్‌ఆర్‌సీ నిర్ణయం కోట్లాది మంది ప్రజలను ఇబ్బందులకు గురిచేసిందని పేర్కొన్నారు.