తెలంగాణ

telangana

ETV Bharat / city

Krishna Board Chairman: ఏపీ నిర్మిస్తున్న జలవిద్యుత్ ప్రాజెక్టు ఆపాలని తెలంగాణ మరో లేఖ

Krishna Board
Krishna Board

By

Published : Sep 28, 2021, 6:15 PM IST

Updated : Sep 28, 2021, 6:51 PM IST

18:14 September 28

Krishna Board Chairman: ఏపీ నిర్మిస్తున్న జలవిద్యుత్ ప్రాజెక్టు ఆపాలని తెలంగాణ మరో లేఖ

కృష్ణా బోర్డు ఛైర్మన్‌కు తెలంగాణ మరో లేఖ రాసింది. ఏపీ నిర్మిస్తున్న పిన్నపురం జలవిద్యుత్ ప్రాజెక్టు ఆపాలని విజ్ఞప్తి చేస్తూ.. కేఆర్ఎంబీ ఛైర్మన్‌కు ఈఎన్‌సీ మురళీధర్ లేఖ రాశారు. కొత్త, ప్రస్తుత ప్రాజెక్టుల విస్తరణ ఆపాలని తెలంగాణ కోరింది. బోర్డు, అపెక్స్ కౌన్సిల్ అనుమతి లేకుండా చేపట్టవద్దని వినతి చేసింది. లేఖలోని అంశాలను జలశక్తి శాఖ దృష్టికి తీసుకెళ్లాలని లేఖలో తెలంగాణ కోరింది.

కేఆర్ఎంబీ ఛైర్మన్‌కు ఇప్పటికే తెలంగాణ నీటిపారుదల శాఖ ఈఎన్‌సీ మురళీధర్ లేఖలు రాశారు. ​ఏపీ ప్రభుత్వం శ్రీశైలం నుంచి నీరు తరలించకుండా నిలువరించాలని విజ్ఞప్తి చేశారు. పోతిరెడ్డిపాడు, హంద్రీనీవా నీటి తరలింపును కూడా ఆపాలన్నారు. పోతిరెడ్డిపాడు ద్వారా ఇప్పటికే 76.39 టీఎంసీలు తరలించారని.. హంద్రీనీవా ద్వారా ఏపీ 9.28 టీఎంసీలు నీరు తరలించారని లేఖలో ప్రస్తావించారు. 1976 ఒప్పందం ప్రకారం ఏపీ 34 టీఎంసీలలోపే తీసుకోవాలని కోరారు.

కృష్ణా బేసిన్​కు తాము మళ్లిస్తున్న గోదావరి జలాలను లెక్కించేందుకు టెలిమెట్రీ ఏర్పాటు చేయాలని, ఆ జలాలను రెండు రాష్ట్రాలకు పంచాలన్న ఆంధ్రప్రదేశ్ నిరాధార వాదనను పట్టించుకోవాల్సిన అవసరం లేదని తెలంగాణ స్పష్టం చేసింది. కృష్ణా బేసిన్​కు తెలంగాణ మళ్లిస్తున్న గోదావరి జలాలను లెక్కించేందుకు టెలిమెట్రీ ఏర్పాటు చేయాలని, ఆ జలాలను రెండు రాష్ట్రాలకు పరిగణలోకి తీసుకోవాలని ఏపీ గతంలో కేఆర్ఎంబీకి లేఖ రాసింది. దానిపై వివరణ ఇస్తూ తెలంగాణ ఈఎన్సీ కృష్ణా బోర్డుకు లేఖ రాశారు. ఆంధ్రప్రదేశ్ వాదన నిరాధారమైనదని... సహేతుకం కాని డిమాండ్​ను పట్టించుకోవాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు. 

ఇదీ చూడండి:

Last Updated : Sep 28, 2021, 6:51 PM IST

ABOUT THE AUTHOR

...view details