తెలంగాణ

telangana

ETV Bharat / city

కుండపోత వర్షాలతో పోటెత్తుతున్న వరదలు.. ప్రమాదకరస్థాయికి ప్రాజెక్టుల నీటిమట్టం - ప్రమాదకరస్థాయికి ప్రాజెక్టుల నీటిమట్టం

Telangana Projects: గోదావరి ఉగ్రరూపం కొనసాగుతోంది. ఎగువ నుంచి పోటెత్తుతున్న వరదకు రాష్ట్రంలో కురుస్తున్న వర్షాలు తోడై ఉరకలెత్తుతోంది. పరివాహకంలోని దాదాపుగా అన్ని ప్రాజెక్టుల గేట్ల నుంచి ప్రవాహం పరుగులు పెడుతోంది. శ్రీరామ్ సాగర్ కు 34గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. కడెం జలాశయానికి పరిమితికి మించి పోటెత్తిన ప్రవాహం ఆందోళన కలిగించింది.

telangana all projects filled full of water due to continuous rains
telangana all projects filled full of water due to continuous rains

By

Published : Jul 13, 2022, 9:14 PM IST

Telangana Projects: శ్రీరామ్ సాగర్ నుంచి భద్రాచలం వరకు అఖండ గోదావరి దర్శనమిస్తోంది. ఎగువ నుంచి పోటెత్తున్న వరదకు ఉపనదుల సంగమం తోడై ఉగ్రరూపం దాల్చింది. తెలంగాణలో గోదావరి ప్రవేశించే నిజామాబాద్ జిల్లా రెంజల్ మండలం కందకుర్తి త్రివేణి సంగమం వద్ద తెలంగాణ-మహారాష్ట్ర లను కలిపే వంతెనను ఆనుకుని ప్రవాహం కొనసాగుతోంది. ప్రాచీన శివాలయం వరద నీటిలో మునిగిపోయింది. శ్రీరాంసాగర్ ప్రాజెక్టుకు భారీగా ప్రవాహం పోటెత్తుతోంది. 3లక్షల 93వేల 245 క్యూసెక్కుల ఇన్ ఫ్లో వస్తుండగా.... 34 గేట్లు ఎత్తి.. 4లక్షల 7వేల 535 క్యూసెక్కులను దిగువకు వదులుతున్నారు. ఎస్సారెస్పీ పూర్తి నీటి నిల్వ సామర్థ్యం 90.30 టీఎంసీలు కాగా... ఎగువ నుంచి వరద ఉద్ధృతిని దృష్టిలో ఉంచుకొని... 75.465 టీఎంసీల నిల్వనే కొనసాగిస్తున్నారు.

నిర్మల్ జిల్లా కడెం జలాశయంలోకి వరద ప్రమాదకర స్థాయికి చేరింది. స్వాతంత్ర్యం వచ్చిన తొలినాళ్లలో నిర్మితమైన ఈ ప్రాజెక్టుకు 27ఏళ్ల తరువాత భారీగావరద వచ్చింది. ప్రాజెక్టు సామర్థ్యం 700 అడుగులకుగాను 700 అడుగులకు నీరుచేరుకుంది. అప్రమత్తమైన అధికారయంత్రాంగం ప్రాజెక్టులోని 18 గేట్లకుగాను 17 గేట్లన ఎత్తివేశారు. మరో గేటు మొరాయించడంతో ఎత్తలేని పరిస్థితి తలెత్తింది. ఇక్కడ 5లక్షల క్యూసెక్కుల ఇన్ ఫ్లో రాగా... 3లక్షల క్యూసెక్కుల జౌట్ ఫ్లోగా ఏర్పడింది. దాదాపుగా 2లక్షల క్యూసెక్కుల ఉద్రిత ఎక్కువ కావడంతో ప్రాజెక్టుకు ప్రమాదం ఏర్పడింది. మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి సహ ఎమ్మెల్యే రేఖ, కలెక్టర్ ముషారఫ్ హుటాహుటిన కడెం చేరుకొని అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఇదే సమయంలో ఎగువ నుంచి వచ్చే వరద కాస్త తగ్గుముఖం పట్టడడంతో ప్రస్తుతానికి ప్రమాదం తప్పినట్లయింది. 18వ గేటు పక్కన ఉన్న ప్రధాన కాలువకు బుంగపడడంతో వరద వెళ్లేందుకు మార్గం సుగమమైంది.

శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టులోకి భారీగా వచ్చిచేరుతోంది. భారీగా ప్రవాహ ఉద్ధృతితో... నీటి నిల్వ సామర్థ్యం 20టీఎంసీలు కాగా... 14 టీఎంసీలు నిల్వను కొనసాగిస్తూ... దిగువకు వదులుతున్నారు. ఇక్కడి నుంచి వస్తున్న ప్రవాహంతో పాటు.... ఉపనదుల సంగమ ఉద్ధృతితో... కాళేశ్వరం వద్ద రెండో ప్రమాద హెచ్చరిక దాటి ప్రవాహం కొనసాగుతోంది. మేడిగడ్డ వద్ద లక్ష్మీ బ్యారేజీ ఇన్ ఫ్లో 12లక్షల 10వేల600 క్యూసెక్కులు ఉండగా... 85 గేట్ల ద్వారా అదే స్థాయిలో దిగువకు వదులుతున్నారు. సరస్వతి బ్యారేజీ ఇన్ ఫ్లో, ఔట్ ఫ్లో 7.78 లక్షల క్యూసెక్కులు ఉండగా..62 గేట్ల తెరిచి నీటిని వదులుతున్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలంలోని మిడ్ మానేరు ప్రాజెక్టుకు 11.499టీఎంసీల నీరు చేరింది. కరీంనగర్ లోయర్ మానేరు డ్యాంలో 10.25 టీఎంసీల నీరు చేరింది.

గోదావరి వరద ఉద్ధృతితో.... దేవాదుల పనులకు ఆటంకం వాటల్లింది. ఎత్తిపోతల పథకం ఫేజ్ -3లోని ప్యాకేజ్ -3 పనులకు అంతరాయం ఏర్పడింది. టన్నెల్, సర్జ్ పూల్ లను వరద ముంచెత్తింది. భద్రాచలం వద్ద క్రమంగా గోదావరి నీటిమట్టం పెరుగుతోంది. నిన్న శాంతించిన గోదారి ఉగ్రరూపం దాల్చుతుండడంతో అధికారులు మూడో ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. లోతట్టు ప్రాంత ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించాలని కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు. స్నానఘట్టాలు, కల్యాణ కట్ట ప్రాంతాలు ఇంకా వరదనీటిలోనే ఉన్నాయి. రాష్ట్రంలోని చిన్న మధ్యతరహా ప్రాజెక్టుల నుంచి ప్రవాహం పరుగులు తీస్తోంది. లిపేరు, స్వర్ణ, గడ్డెన్నవాగు, వైరా వట్టివాగు ఇతర జలాశయాలు ఇప్పటికే నిండుకుండలా మారింది.

ఇవీ చదవండి:తెలంగాణలో మరో 3 రోజులు విద్యాసంస్థలు బంద్‌

నాన్న వెల్డర్.. కొడుకు జేఈఈ టాపర్.. 99.938% స్కోర్​!

ABOUT THE AUTHOR

...view details