యాసంగి ధాన్యం కొనుగోళ్లపై రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. వరి కోతలను బట్టి కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తామని తెలిపారు. ఇప్పటికే 3,028 ధాన్యం కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. సంచికి 40 కిలోల 700 గ్రాముల ధాన్యం తూకం వేయాలని నిర్ణయించారు. తూకాల్లో రైతులకు నష్టం లేకుండా చూడాలని మంత్రి అధికారులను ఆదేశించారు.
'వరి కోతలను బట్టి రాష్ట్రంలో ధాన్యం కొనుగోలు కేంద్రాలు' - grain purchase in telangana
అకాల వర్షాలకు ధాన్యం తడిసిపోకుండా చర్యలు తీసుకోవాలని అధికారులు, ప్రజాప్రతినిధులకు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి సూచించారు. కొనుగోలు కేంద్రాలు సందర్శించి.. తరచూ పర్యవేక్షిస్తుండాలని చెప్పారు. వరి కోతలను బట్టి రాష్ట్రంలో ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తామన్నారు.
మంత్రి నిరంజన్ రెడ్డి, తెలంగాణలో ధాన్యం కొనుగోళ్లు
కొనుగోలు కేంద్రాలను సందర్శించాలని ప్రజాప్రతినిధులకు మంత్రి చెప్పారు. అకాల వర్షాలకు ధాన్యం తడిసిపోకుండా చర్యలు తీసుకోవాలన్నారు. వరి కోతల తర్వాత పొలాల్లో గడ్డిని కాల్చొద్దని రైతులకు సూచించారు. వానాకాలంలో పత్తి, కంది సాగును పెంచాలని తెలిపారు.
- ఇదీ చదవండి :ఫారెస్ట్ అధికారులకు కరోనా రోగుల జలక్