తెలంగాణ

telangana

ETV Bharat / city

Minister Niranjan Reddy : 'తెలంగాణ ఆలోచనలను.. మిగతా రాష్ట్రాలు ఆచరిస్తున్నాయి' - jute mills in telangana

రాష్ట్రంలో మూడు జూట్ మిల్లుల ఏర్పాటుకు సర్కార్ ఒప్పందం కుదుర్చుకుంది. రూ.900 కోట్ల పెట్టుబడి పెడుతున్న కంపెనీలతో నేడు ఎంఓయూలపై సంతకం చేసింది. పరిశ్రమలు, టెక్నో కంపెనీలకు తెలంగాణ అనువైన రాష్ట్రమని వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి(Minister Niranjan Reddy) అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ విజన్ దేశంలోని మిగతా రాష్ట్రాలకు ఓ దిక్సూచిగా మారుతోందని తెలిపారు.

వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి
వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి

By

Published : Sep 17, 2021, 12:48 PM IST

తెలంగాణలో మూడు జూట్ మిల్లుల ఏర్పాటుకు రాష్ట్ర సర్కార్ అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. ఈ మేరకు ఆ కంపెనీలతో కలిసి ఎంఓయూలపై సంతకాలు చేసింది. రూ.900 కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు ఆ కంపెనీలు ముందుకొచ్చాయి. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖల మంత్రి కేటీఆర్, వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి(Minister Niranjan Reddy), పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ పాల్గొన్నారు.

గొప్ప గొప్ప వనరులను అద్భుతంగా వినియోగించుకొని ప్రజల జీవన ప్రమాణాలను పెంచడమే పాలకులకు ఉండాల్సిన గొప్ప లక్షణమని మంత్రి నిరంజన్ రెడ్డి(Minister Niranjan Reddy) అన్నారు. ఈ విషయంలో ముఖ్యమంత్రి కేసీఆర్ విజన్ యావత్​ భారత్​ దేశానికే ఆదర్శమని తెలిపారు. సీఎం కేసీఆర్ ఆలోచనలను దేశంలోని చాలా రాష్ట్రాలు ఆచరణలో పెడుతున్నాయని చెప్పారు.

"యూఎన్.. ప్రజలకు ఉత్తమ జీవన ప్రమాణాలు కల్పించడమే ప్రభుత్వాల ప్రధాన విధి అని చెప్పింది. దీన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ అక్షరాలా పాటిస్తున్నారు. రాష్ట్ర ప్రజలకు ఉత్తమ జీవన ప్రమాణాలు కల్పించడమే కాదు.. వారి ప్రగతికి అన్ని విధాలా కృషి చేస్తున్నారు. 2015 సెప్టెంబర్ 15న యూఎన్.. ప్రపంచంలోని ప్రజలకు మంచినీటి వసతి కల్పించాలని చెప్పింది.. కానీ అంతకంటే ముందే 2014 జూన్ 2న తెలంగాణలో అధికారంలోకి వచ్చిన కేసీఆర్.. ముఖ్యమంత్రి పదవి చేపట్టిన వెంటనే ప్రతి ఒక్కరికి మంచినీరందించాలనే ఉద్దేశంతో మిషన్ భగీరథ పథకం ప్రారంభించారు."

- నిరంజన్ రెడ్డి, రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి

మిషన్ భగీరథ పథకాన్ని స్వయంగా ప్రధాని మోదీయే ప్రారంభించారని మంత్రి నిరంజన్ రెడ్డి(Minister Niranjan Reddy) అన్నారు. రాష్ట్రంలో అత్యంత తక్కువ సమయంలో అత్యంత ఎక్కువ మందికి ఉచిత మంచినీళ్లు సరఫరా చేసిన ఈ పథకాన్ని మోదీ పలుమార్లు ప్రశంసించారని తెలిపారు. ప్రపంచంలో అతిపెద్ద మూడో మ్యాన్ మేడ్ ఫారెస్ట్​గా తెలంగాణ పేరుగాంచినట్లు మంత్రి వెల్లడించారు. తెలంగాణ రాష్ట్రం పరిశ్రమలు, టెక్నో కంపెనీలకు అనువైన ప్రాంతమని పేర్కొన్నారు. వ్యవసాయం దాని అనుబంధ రంగాలను ఒక ప్రత్యేక దిశలో ప్రగతి పథంలో నడిపిస్తున్న ఘనత కేసీఆర్​దని కొనియాడారు.

వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి

ABOUT THE AUTHOR

...view details