తెలంగాణ

telangana

ETV Bharat / city

'సాగును పరిగణలోకి తీసుకుని యూరియా సరఫరా జరగాలి' - telangana agriculture minister niranjan reddy

తెలంగాణలో యూరియా సరఫరాలో మాత్రమే ఇబ్బందులున్నాయని, ఇతర ఎరువుల విషయంలో ఎలాంటి సమస్య లేదని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి అన్నారు. 2020-21 వానా కాలానికి సంబంధించి ప్రభుత్వం విజ్ఞప్తి మేరకు కేంద్రం 10.50 లక్షల మెట్రిక్ టన్నుల యూరియాను కేటాయించిందని తెలిపారు.

telangana agriculture minister niranjan reddy about fertilizers
తెలంగాణలో యూరియా సరఫరాలో ఇబ్బందులు

By

Published : Sep 3, 2020, 1:16 PM IST

రాష్ట్రానికి అవసరమైన ఎరువులు అంచనా వేసి ముఖ్యమంత్రి కేసీఆర్ కేంద్రంతో స్వయంగా మాట్లాడారని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి అన్నారు. తెలంగాణలో యూరియా మినహా.. ఇతర ఎరువుల విషయంలో ఎలాంటి సమస్య లేదని స్పష్టం చేశారు. 2020-21 వానా కాలానికి సంబంధించి ప్రభుత్వం విజ్ఞప్తి మేరకు కేంద్రం 10.50 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా కేటాయించిందని తెలిపారు. 11.80 లక్షల మెట్రిక్ టన్నుల ఇతర ఎరువులతో కలిపి మొత్తం 22.30 లక్షల మెట్రిక్ టన్నులు ఇచ్చిందని చెప్పారు. ఈ మేరకు మంత్రి హైదరాబాద్‌లో ఓ ప్రకటన విడుదల చేశారు.

తెలంగాణకు.. కేంద్రం ఇంకా 4.64 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా ఇవ్వాల్సి ఉందని వెల్లడించారు. ఆగస్టు నెలాఖరు నాటికి రావాల్సిన బకాయి 2.54 లక్షల మెట్రిక్ టన్నులు ఉందని వివరించారు.

ఏప్రిల్ 1 నుంచి ఆగస్టు 31 వరకు స్వయంగా కేంద్రం చేసిన కేటాయింపులు 8.69 లక్షల మెట్రిక్ టన్నులని మంత్రి నిరంజన్ రెడ్డి తెలిపారు. ఆగస్టు 31 నాటికి వాస్తవంగా సరఫరా చేసింది 6.15 లక్షల మెట్రిక్ టన్నులు మాత్రమేనని వెల్లడించారు. 2.54 లక్షల మెట్రిక్ టన్నుల బకాయితో ఆగస్టు నెల ముగిసిన దృష్ట్యా... సెప్టెంబరు నెల యూరియా కేటాయింపు 2.10 లక్షల మెట్రిక్ టన్నులు అని ప్రకటించారు.

ఈ నెల 30న వానాకాలం సీజన్ ముగిసే నాటికి రావాల్సిన బకాయి 2.54 లక్షల మెట్రిక్ టన్నులతోపాటు సెప్టెంబర్ నెల కేటాయింపు 2.10 లక్షల మెట్రిక్ టన్నులతో కలిపి కేంద్రం నుంచి ఇంకా 4.64 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా రావాల్సి ఉందని స్పష్టం చేశారు. గత వానా కాలం, ఈ ఏడాది వానా కాలానికి పెరిగిన సాగును పరిగణలోకి తీసుకుని తెలంగాణకు కోతలు లేకుండా యూరియాను సరఫరా చేయాలని రాష్ట్రమంత్రి నిరంజన్ రెడ్డి కేంద్రాన్ని కోరారు.

ABOUT THE AUTHOR

...view details