తెలంగాణ

telangana

ETV Bharat / city

Groceries : పేద బ్రాహ్మణులకు కేవీ రమణాచారి చేయూత - lock down in telangana

లాక్​డౌన్​ వల్ల ఇబ్బందులు పడుతున్న పేద అర్చకులు, పురోహితులకు ప్రభుత్వ సలహాదారు కేవీ రమణాచారి చేయూతనందించారు. 100 మంది బ్రాహ్మణులకు నిత్యావసరాలు అందజేశారు.

kv ramanachari, kvr kits, telangana government adviser
కేవీ రమణాచారి, కేవీఆర్ కిట్స్, ప్రభుత్వ సలహాదారు

By

Published : May 30, 2021, 1:31 PM IST

లాక్​డౌన్​ కారణంగా ఇబ్బందులు పడుతున్న పేద అర్చకులు, పురోహితులకు... రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు కేవీ రమణాచారి సాయం చేశారు. సుమారు 100 మంది బ్రాహ్మణులకు నిత్యావసరాలు అందించారు. పేదలకు సాయం చేసేందుకు దాతలు ముందుకు రావాలని కోరారు.

లాక్​డౌన్ వల్ల ఒక పూట కూడా గడవని పరిస్థితుల్లో చాలా మంది ఉన్నారని... అటువంటి వారికి సాయం చేయగలిగిన ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని రమణాచారి విజ్ఞప్తి చేశారు. మొదటి లాక్​డౌన్ నుంచి ప్రస్తుత లాక్​డౌన్ వరకు కళాకారులను, అర్చకులను, పురోహితులను ఆదుకుంటున్నామని తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details