ఇప్పటి వరకు ఉన్న ప్రధాన వార్తలుఫిలిం ఛాంబర్, ఫెడరేషన్ మధ్య చర్చలు సఫలం.. ఫిలిం ఛాంబర్, ఫిలిం ఫెడరేషన్ మధ్య జరిగిన చర్చలు సఫలమయ్యాయి. దీంతో షూటింగ్స్‌కు యథావిధిగా హాజరు కానున్నట్లు సినీ కార్మిక సంఘాల నాయకులు ప్రకటించారు.ఖమ్మం నగరంలో మాదకద్రవ్యాల కలకలంమాదక ద్రవ్యాల సరఫరా, వినియోగం నియంత్రణకు తెలంగాణ ప్రభుత్వం కట్టుదిట్టమైన చర్యలు చేపడుతోంది. డ్రగ్స్‌పై పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. కానీ డ్రగ్స్ వినియోగం మాత్రం ఆగడం లేదు. ఇప్పుడు ఈ డ్రగ్స్ హైదరాబాద్‌ను దాటి... ఖమ్మం నగరం దాకా పాకింది. కాంగ్రెస్‌లో చేరిన పీజేఆర్ కుమార్తె విజయారెడ్డి పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి సమక్షంలో తెరాస కార్పొరేటర్ విజయారెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరారు. విజయారెడ్డికి రేవంత్ కండువా కప్పి కాంగ్రెస్‌లోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, అంజన్ కుమార్ యాదవ్ పాల్గొన్నారు.రాజధానిలో మరో దారుణం...రాష్ట్ర రాజధానిలో మరో దారుణమైన ఘటన చోటుచేసుకుంది. జూబ్లీహిల్స్ ఘటన మరవక ముందే రోజుకో దారుణం బయటకు వస్తోంది. హైదరాబాద్ ఛత్రినాక పరిధిలో బాలికపై సామూహిక అత్యాచారం జరిగింది. బాలిక వయసు 17 సంవత్సరాలు. ఆ బాలికపై ఇద్దరు యువకులు అత్యాచారం చేసినట్లు పోలీసుల వివరాల ప్రకారం తెలుస్తోంది.'ఎవరు కాదన్నా రాజధాని ఆ నగరమే' ఎవరు అడ్డుపడినా... విశాఖనే పరిపాలనా రాజధానిగా మారుతుందని ఎంపీ విజయసాయిరెడ్డి మరోసారి స్పష్టం చేశారు. కొన్ని కారణాల వల్లే రాజధాని తరలింపు ఆలస్యమవుతోందన్నారు. పంట కాల్వను ఆక్రమించిన తెదేపా నేత అయ్యన్నపాత్రుడికి చట్టపరంగా శిక్ష తప్పదని వ్యాఖ్యానించారు.మహిళ తాకితే స్పృహ కోల్పోతున్న పూజారి..మహిళ స్పర్శ తగిలితే చాలు.. మూర్ఛపోతుండాట ఓ పూజారి. హనుమాన్ భక్తుడిని కావడం వల్లే తనకు ఇలా జరుగుతుందని అంటున్నాడు. విసుగు చెందిన కొందరు భక్తులు అతడిని ఆసుపత్రికి తీసుకెళ్లారు.జీవచ్ఛవంలా చిన్నారి.. దేవుడిపైనే ఆశలు.. కోమాలో ఉన్న తమ చిన్నారి ఎలాగైనా కోలుకోవాలన్నది ఆ తల్లిదండ్రుల ఆశ. ఎంతో మంది వైద్యులను సంప్రదించినా ఫలితం లేదు. చివరకు కదల్లేని స్థితిలో ఉన్న బాలుడిని వెంటపెట్టుకొని చర్చికి వెళ్లారు. ఈటీవీ భారత్ ద్వారా చిన్నారి పరిస్థితి గురించి తెలుసుకున్న ఓ ఫేస్బుక్ గ్రూప్ వారికి అండగా నిలిచింది.రేస్ మధ్యలో 'కోమా'లోకి స్విమ్మర్..అంతర్జాతీయ స్విమ్మింగ్ పోటీల్లో పాల్గొన్న ఓ స్విమ్మర్.. చావు అంచుల దాకా వెళ్లి వచ్చింది. అక్కడే ఉన్న ఆమె కోచ్ అప్రమత్తం అవ్వడం వల్ల అదృష్టం కొద్ది ప్రాణాలతో బయటపడింది. అసలేం జరిగిందంటే..పుంజుకున్న సూచీలు.. సెన్సెక్స్ 440 ప్లస్.. స్టాక్ మార్కెట్లు లాభాల్లో ముగిశాయి. వాహన రంగ షేర్లు పుంజుకోవడం, బ్యాంకింగ్, ఐటీ, ఫార్మా రంగాలు రాణించడం వల్ల మార్కెట్లు లాభపడ్డాయి. బాంబే స్టాక్ ఎక్స్ఛేంజీ సూచీ సెన్సెక్స్ 443 పాయింట్లు పుంజుకొని 52,265 వద్ద ముగిసింది.'ఆర్ఆర్ఆర్' సరికొత్త రికార్డు..రాజమౌళి తెరకెక్కించిన 'ఆర్ఆర్ఆర్' మరో ఘనతను సొంతం చేసుకుంది. ఈ సినిమా హిందీ వెర్షన్.. అత్యంత ఆదరణ పొందిన చిత్రంగా నిలిచినట్లు నెట్‌ఫ్లిక్స్ ప్రకటించింది.