తెలంగాణ

telangana

ETV Bharat / city

సాహిత్య అకాడమీ వెబ్‌సైట్‌ ప్రారంభం - telangan liturature academy website launched by nandini sidhareddy

తెలంగాణ సాహిత్యాన్ని ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చేందుకు... సాహిత్య అకాడమీ ఆధ్యర్యంలో ఓ వెబ్‌సైట్‌ రూపొందించారు. అకాడమీ ప్రచురించిన వంద పుస్తకాలు వెబ్‌సైట్‌లో పొందుపర్చినట్లు ఛైర్మన్‌ సిధారెడ్డి తెలిపారు.

సాహిత్య అకాడమీ వెబ్‌సైట్‌ ప్రారంభం
సాహిత్య అకాడమీ వెబ్‌సైట్‌ ప్రారంభం

By

Published : Feb 7, 2020, 9:20 AM IST

ప్రపంచానికి రాష్ట్ర సాహిత్యాన్ని చేరువ చేసేందుకు తెలంగాణ సాహిత్య అకాడమీ సిద్ధంగా ఉందని... అకాడమీ ఛైర్మెన్ నందిని సిధారెడ్డి అన్నారు. తెలంగాణ సాహిత్య చరిత్రను సేకరించి... ఓ వెబ్‌సైట్ రూపంలో ప్రజల ముందు ఉంచామని ఆయన అన్నారు. హైదరాబాద్ రవీంద్రభారతి ప్రాంగణంలో... అకాడమీ కార్యదర్శి ఏనుగు నర్సింహారెడ్డితో కలిసి వెబ్‌సైట్‌ను ప్రారంభించారు.

వెబ్‌సైట్‌లో సాహిత్య అకాడమీ ప్రచురించిన వంద పుస్తకాలు పొందుపరిచినట్లు తెలిపారు. తెలంగాణ సాహిత్యంపై రూపొందించిన వీడియోలు, సాహిత్యకారుల చరిత్రను ప్రపంచంలో ఎక్కడి నుంచైనా తెలుసుకోవచ్చన్నారు. tsa.telangana.govt.in కు లాగిన్ అయ్యి... సేవలు పొందవచ్చని సూచించారు.

సాహిత్య అకాడమీ వెబ్‌సైట్‌ ప్రారంభం

ఇదీ చదవండి:మద్యం ఊరికే రాదు... మరి ఇలా కుళాయిల్లో వస్తే.!

ABOUT THE AUTHOR

...view details