ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల ఎన్నికల ప్రక్రియ పూర్తైంది. రాష్ట్రంలోని 906 పీఏసీఎస్‌లకు గాను 904 పీఏసీఎస్‌లకు ఎన్నికలు నిర్వహించారు. అందులో 157 సింగిల్ విండోల్లోని 2017 వార్డులన్నీ ఏకగ్రీవమయ్యాయి. మిగిలిన 747 పీఏసీఎస్‌ల్లోని 3,388 వార్డులు కూడా ఏకగ్రీవం అయ్యాయి. మిగిలిన 6,248 వార్డుల డైరెక్టర్ పదవుల కోసం ఇవాళ ఎన్నికలు జరిగాయి. ఈ స్థానాల్లో మొత్తం 14,530 మంది పోటీలో ఉన్నారు.
'సహకార' ఎన్నికలు ప్రశాంతం.. ఫలితాల విడుదల - తెలంగాణ సహకార సంఘాల ఎన్నికలు
ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల ఎన్నికల ఓట్ల లెక్కింపు ముగిసింది. అన్నిచోట్లా ఫలితాలు ప్రకటించినట్లు సహకార శాఖ ప్రకటించింది. ఎన్నికలు ప్రశాంతంగా జరిగినట్లు పేర్కొంది.

telanagana pacs election
ఇవాళ ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు జరిగిన పోలింగ్‌లో 9,11,599 మంది ఓటర్లు తమ ఓటుహక్కు వినియోగించుకున్నారు. అన్ని చోట్లా ఓట్ల లెక్కింపు పూర్తి కావడంతో పాటు ఫలితాలను కూడా ప్రకటించారు. పీఏసీఎస్‌ల పాలకమండళ్లకు నిర్వహించిన ఎన్నికలు ప్రశాంతంగా జరిగినట్లు సహకార శాఖ ప్రకటించింది.
ఇదీ చూడండి:కేటీఆర్ పీఏ పేరుతో రంజీ మాజీ క్రికెటర్ మోసం.. అరెస్ట్