తెలంగాణ

telangana

ETV Bharat / city

పచ్చని పట్టణాలే లక్ష్యంగా.. 'గ్రీన్ స్పేస్ ఇండెక్స్'

పట్టణాల్లో పచ్చదనాన్ని పెంచేందుకు... 'గ్రీన్ స్పేస్ ఇండెక్స్' పేరుతో రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి కేటీఆర్​ కొత్త కార్యక్రమాన్ని ప్రారంభించారు. అత్యుత్తమంగా నిలిచిన మున్సిపాలిటీలకు ప్రతి సంవత్సరం అవార్డులు ఇవ్వనున్నట్టు మంత్రి వెల్లడించారు.

telanagana muncipal ministry introduce green space index program
పచ్చని పట్టణాలే లక్ష్యంగా.. 'గ్రీన్ స్పెస్ ఇండెక్స్'

By

Published : Aug 30, 2020, 8:38 PM IST

Updated : Aug 30, 2020, 9:14 PM IST

పురపాలికల్లో పచ్చదనాన్ని పెంచడాన్ని మరింత ప్రోత్సహించేందుకు పురపాలక శాఖ మంత్రి కేటీఆర్​ కొత్త కార్యక్రమాన్ని ప్రారంభించారు. పట్టణాల్లో మొక్కల పెంపకాన్ని, పార్కుల అభివృద్ధి, ఇతర పచ్చదనాన్ని పెంచే కార్యక్రమాలను ప్రోత్సహించాలనే ఉద్దేశంతో... 'గ్రీన్ స్పేస్ ఇండెక్స్'ను ప్రారంభిస్తున్నట్లు మంత్రి తెలిపారు. ఈ మేరకు పట్టణాల్లో పాటించాల్సిన, పరిగణలోకి తీసుకోవాల్సిన అంశాలకు సంబంధించిన వివరాలను ఆయా పురపాలికలకు అందజేశారు.

వినూత్నంగా ఉండాలి..

ఈ కార్యక్రమానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వ హౌసింగ్, అర్బన్ ఎఫైర్స్ శాఖ... పట్టణాల్లో గ్రీన్ కవర్, ఒపెన్ స్పేస్​ల పైన రూపొందించిన మార్గదర్శకాలకు అనుగుణంగా కార్యక్రమం ఉంటుందని కేటీఆర్ పేర్కొన్నారు. పట్టణాల్లో ప్రజల జీవన ప్రమాణాలను పెంపొందించేందుకు, అందుకు అత్యవసరమైన గ్రీనరీ పెంచడంలో వినూత్నమైన కార్యక్రమాలను తీసుకోవాల్సిన అవసరం ఉందన్న ఆయన... ఈ దిశగా తెలంగాణ ప్రభుత్వం ముందు వరుసలో ఉంటుందని తెలియజేశారు.

పోటీ కోసమే..

తెలంగాణ ప్రభుత్వం హరితహారం పేరుతో... రాష్ట్రవ్యాప్తంగా పచ్చదనాన్ని పెంచే ఉద్దేశంతో చేపట్టిన కార్యక్రమం విజయవంతంగా కొనసాగుతోందన్నారు. ప్రస్తుతం చేపడుతున్న గ్రీన్ స్పేస్ ఇండెక్స్ కార్యక్రమం ద్వారా... అత్యుత్తమంగా నిలిచిన మున్సిపాలిటీలకు ప్రతి సంవత్సరం అవార్డులు అందిస్తామని కేటీఆర్​ తెలిపారు. పురపాలికల మధ్య పోటీతత్వంతో... గ్రీన్ కవర్ పెంపొందించే కార్యక్రమాలు మరింత స్పూర్తితో పెద్ద ఎత్తున కొనసాగుతాయని విశ్వాసం వ్యక్తం చేశారు.

జియో ట్యాగింగ్​తో..

ఈ కార్యక్రమాన్ని జీఐఎస్ వినియోగం, ఉపగ్రహ చిత్రాలు, ఫోటోగ్రఫీ, వీడియోగ్రఫీ, జియో ట్యాగింగ్ వంటి పద్ధతుల ద్వారా రికార్డు చేసి... రానున్న సంవత్సరం తర్వాత ఏ మేరకు ఆయా పట్టణాల్లో గ్రీన్ కవర్ పెరిగిందనే అంశాన్ని గుర్తించనున్నట్టు మంత్రి తెలిపారు. పురపాలికకు అవార్డుతోపాటు, అత్యధిక అర్బన్ గ్రీన్ స్పేస్, బెస్ట్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ అర్బన్ గ్రీన్ స్పేస్, అర్బన్ గ్రీన్ స్పేస్ పర్ క్యాపిట, రోడ్డు సైడ్ మొక్కల పెంపకం వంటి ఇతర కేటగిరీలలోనూ అవార్డులు ఇవ్వనున్నట్టు వెల్లడించారు.

ఇదీ చూడండి:'రాహుల్‌ను అడ్డుకుంటే కాంగ్రెస్‌ నాశనమే'

Last Updated : Aug 30, 2020, 9:14 PM IST

ABOUT THE AUTHOR

...view details