తెలంగాణ

telangana

ETV Bharat / city

తెలంగాణ పద్దు... కేటాయింపులు ఎవరెవరికి ఎలా అంటే? - తెలంగాణ పద్దు 2020-21

telangana budget 2020-21
telangana budget 2020-21

By

Published : Mar 8, 2020, 11:34 AM IST

Updated : Mar 8, 2020, 3:22 PM IST

13:34 March 08

పోలీస్‌శాఖ

పోలీస్‌శాఖకు రూ.5,852 కోట్లు కేటాయింపు

అంతర్జాతీయ స్థాయిలో హైదరాబాద్‌లో చేపట్టిన పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్ నిర్మాణం త్వరలోనే పూర్తి 

82 నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేల కార్యాలయాల నిర్మాణం పూర్తి

ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు రూ.3 కోట్ల చొప్పున నియోజకవర్గ అభివృద్ధికి నిధులు 

త్వరలోనే నిధుల వినియోగానికి సంబంధించి మార్గదర్శకాలు విడుదల

ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల ఎస్‌డీపీ నిధుల కోసం రూ.480 కోట్లు కేటాయింపు

దేశంలో ఆర్థికమాంద్యం నెలకొంది

ఇతర రాష్ట్రాలతో పోల్చితే రాష్ట్ర ఆర్థిక పరిస్థితి గుడ్డిలో మెల్ల అన్న చందంగా కొంత మెరుగ్గా ఉంది

గత ఐదేళ్లలో సొంత రాబడి సగటు వృద్ధిరేటు 21.5 శాతం

ఈ ఫిబ్రవరి నెలాఖరుకు 6.3 శాతానికి తగ్గింది

సొంత రాబడి సగటు వృద్ధిరేటు 15.2 శాతానికి పడిపోయింది


 


 

13:33 March 08

రహదారులు-భవనాలు

రవాణా, రోడ్లు భవనాల శాఖకు రూ.3,494 కోట్లు కేటాయింపు

రహదారుల నిర్మాణం, నిర్వహణ కోసం రూ.750 కోట్లు కేటాయింపు

కలెక్టరేట్లు, డీపీవోలు, పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్ నిర్మాణాల కోసం రూ.550 కోట్లు

నిర్మాణాలు ఈ ఏడాది పూర్తిచేసేందుకు నిధుల కేటాయింపు


 

13:32 March 08

పర్యావరణం

మొక్కలు నాటడం, సంరక్షించే బాధ్యతలు ప్రజాప్రతినిధులు, అధికారులకు తప్పనిసరి చేస్తూ చట్టం

పర్యావరణ, అటవీశాఖకు రూ.791 కోట్లు కేటాయింపు

దేవాలయాల అభివృద్ధి కోసం రూ.500 కోట్లు కేటాయింపు

ధూపదీప నైవేద్యాలు, నిర్వహణ కోసం రూ.50 కోట్లు

13:31 March 08

రెండు పడక గదుల ఇళ్లు

గృహనిర్మాణాల కోసం రూ.11,917 కోట్లు కేటాయింపు

ప్రస్తుతం 2,72,763 ఇళ్ల నిర్మాణం వివిధ దశల్లో ఉంది

వచ్చే ఆర్థిక సంవత్సరంలో లక్షమంది లబ్ధిదారులు సొంత స్థలాల్లో ఇళ్లు నిర్మించుకునేందుకు ఆర్థిక సాయం

13:30 March 08

ఆర్టీసీ అభివృద్ధి

ఆర్టీసీకి రూ.1,000 కోట్లు కేటాయింపు

13:29 March 08

పారిశ్రామిక రంగం

పారిశ్రామిక రంగ అభివృద్ధికి రూ.1,998 కోట్లు

ఈ ఏడాది పారిశ్రామిక ప్రోత్సాహకాల కోసం రూ.1,500 కోట్లు

2013-14 ఐటీ ఎగుమతులు విలువ రూ.50 వేల కోట్లు

2018-19లో ఐటీ ఎగుమతుల విలువ రూ.లక్షా 9 వేల కోట్లకు పెరగడం మనం సాధించిన అభివృద్ధి

ద్వితీయ, తృతీయ శ్రేణి నగరాలు, పట్టణాలకు ఐటీని విస్తరిస్తాం

13:19 March 08

విద్యుత్ రంగం

విద్యుత్ రంగానికి రూ.10,416 కోట్లు కేటాయింపు

రైతులకు 24 గంటలపాటు విద్యుత్ సరఫరా చేస్తోన్న ఏకైక రాష్ట్రం తెలంగాణ

అన్ని రంగాలకు 24 గంటలపాటు విద్యుత్ సరఫరా చేస్తున్నాం

తలసరి విద్యుత్ వినియోగంలో దేశంలోనే తెలంగాణ నంబరు వన్‌గా నిలిచింది

రాష్ట్ర తలసరి విద్యుత్ వినియోగం 1,896 యూనిట్లు

దేశ తలసరి విద్యుత్ వినియోగం 1,181 యూనిట్లు

ఉమ్మడి ఏపీ చరిత్రలో గరిష్ఠ విద్యుత్ డిమాండ్ 13,162 మెగావాట్లు

తెలంగాణ ఏర్పాటైన తర్వాత గరిష్ఠ విద్యుత్ డిమాండ్ 13,168 మెగావాట్లు

విద్యుత్ డిమాండ్ భారీగా పెరిగినా ఒక్కక్షణం కూడా కోత విధించకుండా సరఫరా చేస్తున్నాం

13:16 March 08

వైద్య రంగం

వైద్య రంగానికి రూ.6,186 కోట్లు కేటాయింపు

హైదరాబాద్‌లో బస్తీ దవాఖానాల సంఖ్య 350కి పెంచాలని నిర్ణయం

త్వరలోనే మరో 232 బస్తీ దవాఖానాలు ప్రారంభం

ప్రతి డివిజన్‌లో రెండు బస్తీ దవాఖానాల ఏర్పాటు

ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ, పేదలు ఎక్కువగా నివసించే ప్రాంతాల్లో అదనపు బస్తీ దవాఖానాల ఏర్పాటు

కంటి వెలుగు తరహాలోనే చెవి, ముక్కు, గొంతు, దంత వ్యాధుల నిర్ధరణ కోసం ప్రత్యేక కార్యాచరణ

రాష్ట్రంలోని ప్రతి పౌరుడి హెల్త్ ప్రొఫైల్ రూపకల్పన

అత్యుత్తమ వైద్య సేవల్లో తెలంగాణ దేశంలో మూడోస్థానంలో నిలిచిందని నీతి ఆయోగ్ ప్రకటించింది

కరోనా వైరస్ ప్రబలకుండా అన్ని రకాల చర్యలు తీసుకున్నాం

కరోనా వైరస్ వేసవిలో ఉండే ఎండ వేడికి మనుగడలో ఉండదని వైద్య నిపుణులు చెబుతున్నారు

ఎండాకాలం ప్రారంభమైనందున కరోనాపై ప్రజలు ఆందోళన చెందొద్దు


 

13:14 March 08

విద్యా రంగం

బోధనా రుసుంల కోసం రూ.2,650 కోట్లు కేటాయింపు

పాఠశాల విద్యకు రూ.10,421 కోట్లు కేటాయింపు

ఉన్నత విద్యకు రూ.1,723.27 కోట్లు

సంపూర్ణ అక్షరాస్యత కోసం బడ్జెట్‌లో రూ.100 కోట్లు కేటాయింపు

13:10 March 08

పట్టణ ప్రగతి

పురపాలకశాఖకు బడ్జెట్‌లో రూ.14,809 కోట్లు కేటాయింపు

3 నెలల్లో అన్ని పట్టణాల్లో ప్రజా మరుగుదొడ్ల నిర్మాణం పూర్తిచేస్తాం

పట్టణాలు, నగరాల అభివృద్ధికి ప్రతినెలా రూ.148 కోట్లు విడుదల

పట్టణ మిషన్ భగీరథ పథకం కింద మిగిలిపోయిన 38 మున్సిపాలిటీలకు రూ.800 కోట్లు కేటాయింపు

హైదరాబాద్‌ అభివృద్ధి కోసం వచ్చే ఐదేళ్లలో రూ.50 వేల కోట్లు అవసరమని అంచనా

హైదరాబాద్‌ నగరం, పరిసర ప్రాంతాల అభివృద్ధి, మూసీ నది ప్రక్షాళన, మూసీ రివర్ ఫ్రంట్ ప్రాజెక్టు కోసం రూ.10 వేల కోట్లు కేటాయింపు

త్వరలోనే హైదరాబాద్ పాతబస్తీలో మిగిలిన 5 కిలోమీటర్ల మేర మెట్రో మార్గం పనులు పూర్తి

మెట్రో రెండో దశలో రాయదుర్గం-శంషాబాద్, బీహెచ్‌ఈఎల్-లక్డీకాపూల్ వరకు ప్రణాళికలు సిద్ధం


 

13:05 March 08

నూతన మున్సిపల్ చట్టం

కొత్త పురపాలక చట్టంలో అధికారులు, ప్రజాప్రతినిధుల బాధ్యతలను స్పష్టంగా నిర్వచించాం

ఆస్తుల విలువ మదింపు, సెల్ఫ్ డిక్లరేషన్ విధానం అమల్లోకి తెచ్చాం

భవన నిర్మాణ అనుమతుల కోసం టీఎస్‌ బి-పాస్ విధానాన్ని త్వరలో అమల్లోకి తెస్తాం

13:01 March 08

పంచాయతీరాజ్‌శాఖ

గ్రామీణ ముఖచిత్రం మార్పునకు పటిష్టమైన పంచాయతీరాజ్ చట్టం తీసుకొచ్చాం

నూతన పంచాయతీరాజ్ చట్టం ద్వారా విధుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించే ప్రజాప్రతినిధులు, ఉద్యోగులపై కఠిన చర్యలు 

గ్రామ పంచాయతీల వివాదాల పరిష్కారం కోసం ప్రత్యేక ట్రైబ్యునళ్ల ఏర్పాటు

గ్రామాల అభివృద్ధికి బడ్జెట్‌లోనే నేరుగా నిధుల కేటాయింపు

ఆర్థిక సంఘం ఇచ్చే నిధులకు సమానంగా రాష్ట్ర ప్రభుత్వం కూడా నిధులు అందిస్తోంది

జాతీయ ఉపాధి హామీ పథకం కింద వస్తు సామగ్రి వ్యయం కోసం ప్రతినెలా రూ.65 కోట్లు కేటాయింపు

రూ.600 కోట్ల వ్యయంతో గ్రామాల్లో సీసీ రహదారుల నిర్మాణం

పంచాయతీ పారిశుద్ధ్య కార్మికుల వేతనాలను రూ.8,500కి పెంచాం

గ్రామ పంచాయతీ సిబ్బందికి రూ.2 లక్షల జీవితబీమా సౌకర్యం కల్పించాం

పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి కోసం రూ.23,005 కోట్లు కేటాయింపు 

12:58 March 08

మహిళా-శిశు సంక్షేమం

మహిళా స్వయం సహకార సంఘాలకు వడ్డీలేని రుణాల కింద రూ.1,200 కోట్లు కేటాయింపు

12:55 March 08

కల్యాణలక్ష్మి, బీసీల కోసం అదనపు నిధులు

వెనుకబడిన వర్గాల సంక్షేమ కోసం రూ.4,356.82 కోట్లు కేటాయింపు

కల్యాణలక్ష్మి పథకం అమలు కోసం అదనంగా రూ.650 కోట్లు కేటాయింపు

కల్యాణలక్ష్మి కోసం బడ్జెట్‌లో మొత్తం రూ.1,350 కోట్లు కేటాయింపు

ఎంబీసీ కార్పొరేషన్‌కు రూ.500 కోట్లు కేటాయింపు

12:54 March 08

పాడి, మత్స్యశాఖ

పశుపోషణ, మత్స్యశాఖకు రూ.1,586.38 కోట్లు కేటాయింపు 

12:52 March 08

మైనార్టీల సంక్షేమం

వచ్చే విద్యా సంవత్సరం నుంచి 71 మైనార్టీ జూనియర్ కళాశాలలు ప్రారంభం

మైనార్టీల అభివృద్ధి, సంక్షేమం కోసం రూ.1,518.06 కోట్లు కేటాయింపు

12:41 March 08

సంక్షేమ తెలంగాణ

సంక్షేమం కోసం అత్యధికంగా నిధులు ఖర్చు చేస్తున్న రాష్ట్రంగా తెలంగాణ అగ్రస్థానంలో నిలిచింది

వృద్ధులు, వితంతువలు, బీడీ కార్మికులు, ఒంటరి మహిళలు, బోదకాలు బాధితులు, ఎయిడ్స్ వ్యాధి గ్రస్తులు, గీతాకార్మికుల పింఛను రూ.2,016కి పెంచాం

వికలాంగుల పింఛను రూ.3016కి పెంచాం

ఈ ఆర్థిక సంవత్సరం నుంచి 57 ఏళ్లు నిండిన వారికి వృద్ధాప్య పింఛను అందిస్తాం

ఆసరా పింఛన్ల కోసం ఈ బడ్జెట్‌లో రూ.11,758 కోట్లు కేటాయింపు

ఎస్సీల ప్రత్యేక ప్రగతినిధి కోసం రూ.16,534.97 కోట్లు కేటాయింపు

ఎస్టీల ప్రత్యేక ప్రగతినిధి కోసం రూ.9,771.27 కోట్లు కేటాయింపు

12:39 March 08

మిషన్ భగీరథ

మిషన్ భగీరథ ద్వారా అన్ని ఆవాస ప్రాంతాలకు సురక్షిత, తాగునీరు అందిస్తున్నాం: మంత్రి హరీశ్​ రావు

గడిచిన ఆరేళ్లలో ఏ ఒక్కరూ ఫ్లోరోసిస్ బారిన పడలేదని ఇండియన్ నేచురల్ రిసోర్సెస్ ఎకనామిక్ అండ్ మేనేజ్‌మెంట్ ఫౌండేషన్ ప్రకటించింది

12:36 March 08

మిషన్ కాకతీయ


మిషన్ కాకతీయ కింద 46 వేల చెరువుల పునరుద్ధరణతో సత్ఫలితాలు సాధించాం: మంత్రి హరీశ్​

మిషన్ కాకతీయ ద్వారా చెరువుల కింద 15 లక్షల ఎకరాల ఆయకట్టు స్థిరీకరణ చేశాం

చెరువుల్లో నీటి సామర్థ్యం, భూగర్భ జల మట్టాలు గణనీయంగా పెరిగాయి

12:25 March 08

సాగునీటి రంగం

నా తెలంగాణ కోటి రతనాలవీణ అని దాశరథి నినదించారు

నా తెలంగాణ కోటి ఎకరాల మాగాణం కావాలన్నదే కేసీఆర్ స్వప్నం

గోదావరి, కృష్ణా జలాలను సమగ్రంగా వినియోగించుకునేందుకు కేసీఆర్ ప్రాజెక్టుల రీడిజైన్ చేశారు

బడ్జెట్‌లో సింహభాగం నిధులు నీటిపారుదల రంగానికి కేటాయింపు

మూడేళ్లలో కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం పూర్తి చేసి కేసీఆర్ జాతికి అంకితం చేశారు

ప్రపంచంలోనే అతిపెద్ద బహుళ దశళ ఎత్తిపోతల పథకంగా కాళేశ్వరం ప్రఖ్యాతి గాంచింది

కాళేశ్వరం స్ఫూర్తితో పాలమూరు-రంగారెడ్డి, సీతారామ వంటి ప్రాజెక్టుల నిర్మాణం వేగంగా సాగుతున్నాయి

సమైక్య రాష్ట్రంలో తుమ్మలు మొలిచిన ఎస్సారెస్పీ కాల్వలో నేడు నిండుగా ప్రవహిస్తూ కళకళలాడుతున్నాయి

కాళేశ్వరం తొలి ఫలం అందుకున్న జిల్లాలు కరీంనగర్, వరంగల్, మహబూబాబాద్, జనగామ, సూర్యాపేట, ఖమ్మం

మధ్యమానేరు 24 టీఎంసీల నీటితో నిండు కుండలా మారింది

త్వరలోనే రంగనాయక సాగర్, మల్లన్న సాగర్, కొండపోచమ్మ నిర్మాణాల పూర్తి

పాలమూరు, రంగారెడ్డి,వికారాబాద్ జిల్లాల రూపురేఖలు మార్చేందుకు పాలమూరు-రంగారెడ్డి పథకం

కాళేశ్వరం మాదిరిగానే పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టును తక్కువ కాలంలో పూర్తి చేస్తాం

పెండింగ్ ప్రాజెక్టులు పూర్తిచేసి ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లాలో 8 లక్షల ఎకరాలకు సాగునీరు అందించాం

1,000 చెరువుల్లో నీటిని నింపి వలసలు నివారించాం

సింగూర్ కాల్వ నిర్మాణం పూర్తిచేసి 40 వేల ఎకరాలకు సాగునీరు అందించాం

పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేసి సుమారు 20 లక్షల ఎకరాలకు సాగునీరు అందిస్తున్నాం

భక్త రామదాసు ప్రాజెక్టును 11 నెలల్లోనే పూర్తిచేయడం రికార్డు

తుమ్మిళ్ల ఎత్తిపోతల పథకాన్ని 8 నెలల్లో పూర్తిచేయడం ఒక ఘనత

సీతారామ ప్రాజెక్టు నిర్మాణం ద్వారా 10 లక్షల ఎకరాలకు సాగునీరు, వందలాది గ్రామాలకు తాగునీరు


 


 

12:23 March 08

పాడి పరిశ్రమ-అభివృద్ధి

సమైక్య రాష్ట్రంలో విజయ డెయిరీ రూ.30 కోట్ల నష్టాలతో మూతపడే పరిస్థితికి వచ్చింది

ప్రభుత్వం అందించిన సహకారంతో ఇప్పుడు విజయ డెయిరీ రూ.35 కోట్ల లాభాలు గడించింది

రైతుల నుంచి సేకరించే పాలపై లీటరుకు ప్రభుత్వం రూ.4 ప్రోత్సాహం అందిస్తోంది

పాలసేకరణ ప్రోత్సాహం ద్వారా 99,282 మంది పాడి రైతులకు లబ్ధి

పాడి రైతుల ప్రోత్సాహకం కోసం రూ.100 కోట్లు కేటాయింపు

12:21 March 08

రైతు వేదికల ఏర్పాటు

రైతు వేదికల నిర్మాణం కోసం రూ.350 కోట్లు కేటాయింపు

రైతులు చర్చించుకునేందుకు వీలుగా రైతు వేదికల ఏర్పాటు

ప్రతి 5 వేల ఎకరాల క్లస్టర్‌కు ఒక రైతు వేదిక నిర్మించాలని నిర్ణయం

ఒక్కో రైతు వేదిక నిర్మాణానికి రూ.12 లక్షల వ్యయం


 

12:20 March 08

రైతు సమన్వయ సమితుల పేరు రైతుబంధు సమితులుగా మార్పు

అసంఘటిత రైతులను సంఘటిత శక్తిగా మార్చడమే రైతుబంధు సమితుల ప్రధాన లక్ష్యం

12:18 March 08

బిందు, తుంపర సేద్యం

తుంపర సేద్యం కోసం ఎస్సీ, ఎస్టీలకు వందశాతం,

బీసీ, సన్న, చిన్నకారు రైతులకు 90 శాతం, ఇతరులకు 80 శాతం రాయితీ

తుంపర సేద్యం పథకం కింద 2,49,200 మంది రైతులకు రూ.1,819 కోట్ల లబ్ధి చేకూర్చాం

సూక్ష్మ సేద్యం కోసం రూ.600 కోట్లు కేటాయింపు

12:15 March 08

కనీస మద్దతు ధర

రైతులు పండించిన పంటలకు మద్దతు ధర లభించే విధంగా చర్యలు

వరి, పత్తి, మొక్కజొన్న, కందులు, వివిధ పంటల కొనుగోలు కోసం భారీగా కేంద్రాల ఏర్పాటు

కందులను కేంద్రం ఈ ఏడాది కొద్దిశాతమే కొనుగోలు చేసింది

ఎంత ఖర్చయిన సరే మొత్తం కందులు కొనుగోలు చేయాలని నిర్ణయించాం

మార్కెట్ ఇంటర్వెన్షన్ ఫండ్ కోసం రూ.1,000 కోట్లు కేటాయింపు

12:13 March 08

పండ్లు, కూరగాయల సాగులో స్వయం సమృద్ధే సీఎం కేసీఆర్ సంకల్పం

ములుగులో కొండా లక్ష్మణ్ బాపూజీ ఉద్యాన విశ్వవిద్యాలయం ఏర్పాటు చేశాం

మేడ్చల్ జిల్లా జీడిమెట్ల, సిద్దిపేట జిల్లా ములుగులో సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్ ఏర్పాటు చేశాం

ఈ కేంద్రాల నుంచి నాణ్యమైన నారు సరఫరా, రైతులకు శిక్షణ, సాంకేతిక సహకారం అందిస్తున్నాం

12:03 March 08

మొదట్లో రైతుబంధు కింద ఏడాదికి ఎకరానికి రూ.8 వేలు అందించాం

ఎన్నికల ప్రణాళికలో ఇచ్చిన హామీ మేరకు ప్రస్తుతం ఏడాదికి ఎకరానికి రూ.10 వేలు అందిస్తున్నాం

2019-20లో రైతుబంధుకు రూ.12 వేల కోట్లు కేటాయించి పంపిణీ చేస్తున్నాం

కొత్త పాసుపుస్తకాల మంజూరు వల్ల రైతుబంధు లబ్ధిదారుల సంఖ్య వచ్చే ఏడాది పెరుగుతోంది

పెరిగిన రైతుబంధు లబ్ధిదారులకు అనుగుణంగా బడ్జెట్‌లో రూ.2 వేల కోట్ల అదనపు కేటాయింపులు

రైతుబంధు కోసం బడ్జెట్‌లో రూ.14 వేల కోట్ల కేటాయింపునకు ప్రతిపాదన

రైతు ఏ కారణంతో మృతిచెందినా వాళ్ల కుటుంబానికి రైతుబీమా కింద రూ.5 లక్షల పరిహారం

18-60 ఏళ్ల వయసు ఉన్న ప్రతిరైతుకు బీమా సదుపాయం వర్తింపు

రైతుబీమా కింద రైతుల ప్రీమియం రూ.2,271.50 కోట్లు ప్రభుత్వమే చెల్లిస్తుంది

రైతు మరణించిన 10 రోజుల్లోనే వారి కుటుంబసభ్యులకు రూ.5 లక్షలు అందిస్తున్నాం

రైతుబీమా కోసం రూ.1,141 కోట్లు కేటాయింపు

రైతులకు 2014లో రూ.16,124 కోట్లు రుణమాఫీ చేశాం

ఇప్పుడు ఆర్థికమాంద్యం ఉన్నప్పటికీ రైతు రుణమాఫీ అమలుకు శ్రీకారం

రూ.25 వేల లోపు రుణాలు ఉన్న రైతులు 5,83,916 మంది

రూ.25 వేల లోపు ఉన్న రుణాల మాఫీ కోసం ఈనెలలో రూ.1,198 కోట్లు విడుదల చేస్తాం

రుణమాఫీ మొత్తాన్ని ప్రతీ రైతుకు వ్యక్తిగతంగా, చెక్కుల రూపంలో ఎమ్మెల్యేల చేతుల మీదుగా అందిస్తాం

రూ.25 వేల నుంచి రూ.లక్ష లోపు ఉన్న రైతుల రుణాల మొత్తం రూ.24,738 కోట్లు

రూ.25 వేల నుంచి రూ.లక్ష లోపు ఉన్న రుణాలను 4 విడతల్లో అందజేస్తాం

విత్తనాల రాయితీ కోసం రూ.142 కోట్లు అందించాం

గోదాముల నిల్వ సామర్థ్యం 22.47 లక్షల మెట్రిక్ టన్నులకు పెంచాం

11:58 March 08

2020-21 ఆర్థిక సంవత్సరానికి రూ.1,82,914.42 కోట్లతో బడ్జెట్

రెవెన్యూ వ్యయం రూ.1,38,669.82 కోట్లు
పెట్టుబడి వ్యయం రూ.22,061.18 కోట్లు
రెవెన్యూ మిగులు రూ.4,482.12 కోట్లు
ఆర్థిక లోటు రూ.33,191.25 కోట్లు

11:53 March 08

వ్యవసాయ, అనుబంధ రంగాల్లో గణనీయమమైన అభివృద్ధి సాధించాం: మంత్రి హరీశ్​ రావు

పంటల ఉత్పత్తిలో 23.7 శాతం, పాడిపశువుల రంగంలో 17.3 శాతం సాధించాం

చేపల పెంపకంలో 8.1 శాతం వృద్ధి సాధించాం

రైతుబంధు, నీటిపారుదల ప్రాజెక్టుల నిర్మాణం, గొర్రెలు, బర్రెల పంపిణీ, చేపల పెంపకం వంటి పథకాలు రైతు సంక్షేమం, రాష్ట్రాభివృద్ధికి ఊతమిస్తున్నాయి

సేవారంగంలో 2019-20లో 14.1 శాతం వృద్ధి నమోదు

దేశ తలసరి ఆదాయం కంటే రాష్ట్ర తలసరి ఆదాయం రూ.93,166 ఎక్కువ

2019-20లో రాష్ట్ర తలసరి ఆదాయం రూ.2,28,216

2019-20లో దేశ తలసరి ఆదాయం రూ.1,35,050

సమైక్య రాష్ట్రంలో వ్యవసాయం సంక్షోభంలో కూరుకుపోయింది

స్వరాష్ట్రంలో వ్యవసాయానికి నూతన జలసత్వాలు కల్పించాం

రాష్ట్రంలో అమలు చేస్తోన్న వ్యవసాయాభివృద్ధి విధానాలు దేశానికి ఆదర్శంగా నిలిచాయి

 రైతుబంధు ద్వారా సత్ఫలితాలు సాధించాం

రైతుబంధు తరహా పథకాలను ఇతర రాష్ట్రాలు ప్రవేశపెట్టాయి

రైతుబంధు ప్రేరణతో కేంద్రం పీఎం కిసాన్ సమ్మాన్ యోజనను ప్రవేశపెట్టింది

11:49 March 08

15వ ఆర్థిక సంఘం మధ్యంతర నివేదిక ప్రకారం రాష్ట్రానికివచ్చే పన్నుల వాటా 2.437 శాతం నుంచి 2.133 శాతానికి తగ్గింది: మంత్రి హరీశ్​ రావు

2020-21 ఆర్థిక సంవత్సరంలో రాష్ట్రానికి రావాల్సిన నిధుల్లో రూ.2,384 కోట్లు తగ్గాయి

ప్రతికూల పరిస్థితుల్లో సరైన వ్యూహాలు రూపొందించి రాష్ట్రం అభివృద్ధి దిశగా పురోగమించేందుకు ప్రయత్నాలు

ఈ మార్చి నెలాఖరు వరకు రూ.లక్షా 36 వేల కోట్లు వ్యయం చేస్తాం

కేంద్రం నుంచి పన్నుల వాటా, గ్రాంట్లలో కోత ఉన్నప్పటికి స్వీయ ఆదాయ వృద్ధి ద్వారా పూడ్చుకోగలిగాం

బడ్జెట్ అంచనాల మేరకు ఖర్చు చేస్తున్నాం

2019-20లో రాష్ట్ర జీఎస్‌డీపీ 9,69,604 కోట్లు అంచనా

2018-19లో రాష్ట్ర జీఎస్‌డీపీ 14.3 శాతం

దేశంలో ఆర్థికమాంద్యం వల్ల 2019-20 నాటికి జీఎస్‌డీపీ 12.6 శాతానికి పడిపోయింది

దేశ వృద్ధిరేటు 11.2 శాతం నుంచి 7.5 శాతానికి తగ్గింది

దేశమంతా ఆర్థికమాంద్యంలో ఉన్నప్పటికి తెలంగాణలో రెండంకెల వృద్ధిరేటు సాధించాం

ప్రభుత్వ ముందస్తు చర్యల వల్లే రెండంకెల వృద్ధి సాధించగలిగాం

11:40 March 08

2020-21 ఆర్థిక సంవత్సరానికి రూ.1,82,914.42 కోట్లతో బడ్జెట్: మంత్రి హరీశ్​

వాస్తవిక దృక్పథంతో 2020-21 బడ్జెట్ రూపకల్పన

బడ్జెట్ అంటే కేవలం కాగితాల మీద వేసుకునే అంకెల వరుస కాదు

బడ్జెట్ సామాజిక విలువల స్వరూపం

దేశ చరిత్రలో తెలంగాణ ఉద్యమం నూతన అధ్యయనాన్నిసృష్టించింది

అహింసా మార్గంలో రాష్ట్రం అవతరించింది

స్వరాష్ట్ర స్వప్నాన్ని సాకారం చేసిన ఉద్యమనేత సీఎం కేసీఆర్

ముఖ్యమంత్రి కేసీఆర్ దార్శనికతతో తెలంగాణ ప్రగతిశీల రాష్ట్రంగా కొనసాగుతోంది

సీఎం కేసీఆర్ సమగ్ర దృష్టి, శ్రద్ధాశక్తుల ప్రతిబింబమే ఈ బడ్జెట్  

దేశ ఆర్థిక వృద్ధిరేటు గతేడాదిన్నర నుంచి తగ్గుతూ వస్తుంది

కేంద్ర ఆదాయ వనరులు తగ్గడంతో రాష్ట్రాలకు వచ్చే పన్నుల వాటా, గ్రాంట్లలో కోతలు

ఆర్థికమాన్య ప్రభావం, రాష్ట్ర పన్నులు, పన్నేతర ఆదాయంపై పడింది

2019-20లో కేంద్రం నుంచి రాష్ట్రానికి రావాల్సిన పన్నుల వాటా రూ.3,731 కోట్లు తగ్గింది

కేంద్రం నుంచి రావాల్సిన ఐజీఎస్టీ, జీఎస్టీ పరిహారం, నిధులు సకాలంలో రావట్లేదు

కేంద్ర నుంచి వచ్చే నిధులు కూడా అరకొరగా విడుదల చేస్తున్నారు

2018-19లో రాష్ట్ర రెవెన్యూ వృద్ధిరేటు 16.1 శాతం

కేంద్రం అరకొరగా నిధులు విడుదల చేయడంతో రాష్ట్ర రెవెన్యూ వృద్ధిరేటు 6.3  శాతానికి తగ్గింది

11:36 March 08

శాసనమండలిలో బడ్జెట్​ను ప్రవేశపెడుతున్న మంత్రి ప్రశాంత్​ రెడ్డి

10:04 March 08

తెలంగాణ బడ్జెట్​ (2020-21)

అసెంబ్లీలో బడ్జెట్​ను ప్రవేశపెడుతున్న మంత్రి హరీశ్​ రావు

Last Updated : Mar 8, 2020, 3:22 PM IST

ABOUT THE AUTHOR

...view details