తెలంగాణ రాష్ట్ర ఉపాధ్యాయ సంఘాల పోరాట కమిటీ ఆధ్వర్యంలో హైదరాబాద్ ఇందిరాపార్క్ ధర్నా చౌక్ వద్ద మహాధర్నా నిర్వహించారు. ఉపాధ్యాయ, విద్యారంగ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఐఆర్, పీఆర్సీ ప్రకటించి, వెంటనే పదోన్నతుల ప్రక్రియ చేపట్టాలని కోరారు. భాషా పండిట్, పీఈటీలను అప్‌గ్రేడ్ చేయాలన్నారు. సీపీఎస్‌ను రద్దు చేసి పాత విధానాన్ని పునరుద్ధరించాలని విజ్ఞప్తి చేశారు. ఎన్నికల హామీ ప్రకారం పదవీ విరమణ వయస్సు 61 సంవత్సరాలకు పెంచాలని డిమాండ్ చేశారు.
ధర్నాచౌక్ వద్ద ఉపాధ్యాయ సంఘాల మహాధర్నా - indira park
ఉపాధ్యాయ, విద్యారంగ సమస్యలు పరిష్కరించాలని రాష్ట్ర ఉపాధ్యాయ సంఘాల పోరాట కమిటీ డిమాండ్ చేసింది. ప్రభుత్వం స్పందించకుంటే పోరాటం ఉద్ధృతం చేస్తామని టీచర్స్ హెచ్చరించారు.
ధర్నాచౌక్ వద్ద ఉపాధ్యాయ సంఘాల మహాధర్నా