తెలంగాణ

telangana

ETV Bharat / city

తడబడిన భారత బ్యాట్స్​మెన్... 78కే ఆలౌట్ - ఇండియా, ఇంగ్లాండ్‌ మూడో టెస్టు

లీడ్స్‌ వేదికగా టీమ్‌ఇండియా, ఇంగ్లాండ్‌ మధ్య జరుగుతున్న మూడో టెస్టులో భారత బ్యాట్స్​మెన్ తడబడ్డారు. ఇంగ్లాండ్ బౌలర్ల దాటికి చేతులెత్తేశారు. దీంతో తొలి ఇన్నింగ్స్​లో 78 పరుగులకే ఆలౌటైంది కోహ్లీసేన.

first innings
first innings

By

Published : Aug 25, 2021, 8:40 PM IST

టాస్‌ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన కోహ్లీసేనకు తొలి ఓవర్‌లోనే షాక్‌ తగిలింది. చివరి రెండు టెస్టుల్లో భారీ స్కోర్లు చేసిన కేఎల్ రాహుల్(0) డకౌట్‌ అయ్యాడు. అండర్సన్‌ వేసిన ఇన్నింగ్స్‌ నాలుగో బంతికి కీపర్‌ బట్లర్‌కి క్యాచ్‌ ఇచ్చాడు. కేఎల్ ఔటయిన కొద్దిసేపటికే టీమ్‌ఇండియాకు అండర్సన్‌ మరో షాక్‌ ఇచ్చాడు. జిమ్మీ వేసిన 4.1 ఓవర్‌కు పుజారా బట్లర్‌కే క్యాచ్‌ ఇచ్చి పెవిలియన్‌ చేరాడు.అనంతరం క్రీజులోకి వచ్చిన కెప్టెన్‌ విరాట్ కోహ్లీ(7) ఎక్కువసేపు నిలవలేకపోయాడు. కోహ్లీ అండర్సన్‌ బౌలింగ్‌లోనే బట్లర్‌కు క్యాచ్‌ ఇచ్చి ఔటయ్యాడు. ఆ తర్వాత రహానె(18) కాసేపు నిలకడగా ఆడినా.. రాబిన్సన్‌ వేసిన 25.5 ఓవర్‌కు బట్లర్‌కు చిక్కాడు. దీంతో లంచ్ సమయానికి నాలుగు వికెట్లు నష్టానికి 56 పరుగులు చేసింది టీమ్ఇండియా.


లంచ్ తర్వాతా అదే దారి

లంచ్ సమయానికి నాలుగు వికెట్లు కోల్పోయినా.. ఓపెనర్ రోహిత్ శర్మ, పంత్ క్రీజులో ఉండటం వల్ల అభిమానుల్లో ఆశలు సజీవంగా ఉన్నాయి. కానీ భోజన విరామం అనంతరం కాసేపటికే పంత్ (2)ను బోల్తాకొట్టించాడు రాబిన్సన్. అనంతరం కుదురుగా ఆడిన రోహిత్ కూడా పుల్ షాట్ ఆడబోయి ఓవర్టన్ బౌలింగ్​లో రాబిన్సన్​కు సింపుల్ క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. జడేజా (4), షమీ (0), బుమ్రా (0) సిరాజ్ (3) కూడా విఫలమవడం వల్ల భారత్ తొలి ఇన్నింగ్స్​లో 78 పరుగులకు ఆలౌటైంది.

ఇదీ చూడండి: లార్డ్స్​ మైదానంలో కోహ్లీ, రూట్ తీవ్ర వాగ్వాదం

ABOUT THE AUTHOR

...view details