తెలంగాణ

telangana

ETV Bharat / city

రెండో వన్డేలో టీమ్ఇండియా విజయం... సిరీస్ కైవసం చేసుకున్న గబ్బర్​ సేన

శ్రీలంకతో జరిగిన రెండో వన్డేలో టీమ్ఇండియా విజయం సాధించింది. ప్రత్యర్థి నిర్దేశించిన 276 పరుగుల లక్ష్యాన్ని 49.1 ఓవర్లలో చేధించింది. దీంతో 2-0తో గబ్బర్​ సేన సిరీస్​ను కైవసం చేసుకుంది.

team india
team india

By

Published : Jul 21, 2021, 6:59 AM IST

దీపక్‌ చాహర్‌ మాయ చేశాడు. శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌లో భారత్‌ మూడు వికెట్ల తేడాతో అద్భుత విజయం సాధించింది. దీంతో ఇంకో మ్యాచ్‌ ఉండగానే భారత్‌ సిరీస్‌ను సొంతం చేసుకుంది. 276 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్‌ 193 పరుగులకే 7 కీలక వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. ఈ స్థితిలో క్రీజులో ఉన్న బౌలర్లు దీపక్‌ చాహర్‌(69 నాటౌట్‌: 82 బంతుల్లో 7X4, 1X6), భువనేశ్వర్‌(19 నాటౌట్‌: 28 బంతుల్లో 2X4)అద్భుతంగా ఆడి భారత్‌ను గెలిపించారు. సూర్యకుమార్‌ యాదవ్ (53: 44 బంతుల్లో 4X6), కృనాల్‌ పాండ్యా (35: 54 బంతుల్లో 3X4) రాణించారు.

టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకున్న శ్రీలంకకు రెండో వన్డేలోనూ శుభారంభం దక్కింది. ఓపెనర్లు ఫెర్నాండో, భానుక (36) ధాటిగా ఆడి తొలి వికెట్‌కు 77 పరుగులు జోడించారు. అయితే, ప్రమాదకరంగా మారుతున్న వీరిని చాహల్‌ విడదీశాడు. 14వ ఓవర్‌లో వరుస బంతుల్లో భానుకతో పాటు వన్‌డౌన్‌ బ్యాట్స్‌మన్‌ రాజపక్స(0)ను ఔట్ చేసి భారత జట్టుకు ఉపశమనం కలిగించాడు.

ఆ తర్వాత ధనంజయ(32)తో కలిసి ఫెర్నాండో ఇన్నింగ్స్‌ నిర్మించాడు. మూడో వికెట్‌కు వీరిద్దరూ 47 పరుగులు జోడించారు. ఈ క్రమంలోనే అర్ధశతకం పూర్తి చేసుకున్న ఫెర్నాండో భువనేశ్వర్‌ బౌలింగ్‌లో ఔటయ్యాడు. కాసేపటికే ధనంజయ దీపక్‌ చాహర్‌ బౌలింగ్‌లో పెవిలియన్‌ చేరాడు. అప్పటికి శ్రీలంక స్కోర్‌ 134/4గా నమోదైంది.

ఆపై మరోసారి జోడీ కట్టిన అసలంక, కెప్టెన్‌ దాసున్‌ షనక (16) నెమ్మదిగా ఆడి ఇన్నింగ్స్‌ చక్కదిద్దే ప్రయత్నం చేశారు. అయితే, చాహల్‌ బౌలింగ్‌లో షనక బౌల్డయ్యాడు. కాసేపటికే హసరంగా(8)ను దీపక్‌ చాహర్‌ బోల్తా కొట్టించాడు. ఈ నేపథ్యంలోనే జత కట్టిన అసలంక, కరుణరత్నె మరో కీలక భాగస్వామ్యం నెలకొల్పారు. వీరిద్దరూ ఏడో వికెట్‌కు 50 పరుగులు జోడించారు.

అయితే, చివర్లో అసలంక ధాటిగా ఆడే క్రమంలో భువి బౌలింగ్‌ సబ్‌స్టిట్యూట్‌ ఫీల్డర్‌ దేవ్‌దత్‌ చేతికి చిక్కాడు. అనంతరం టెయిలెండర్లతో కలిసిన కరుణరత్నె చివరివరకు బ్యాటింగ్‌ చేశాడు. దాంతో తమ జట్టుకు విలువైన పరుగులు అందించాడు. అయితే, భారత బౌలర్లలో భువనేశ్వర్‌ కుమార్‌, యుజువేంద్ర చాహల్‌ చెరో మూడు వికెట్లు పడగొట్టగా, దీపక్‌ చాహర్‌ రెండు వికెట్లు తీశాడు.

ఇదీ చదవండి:చివరి నిమిషంలోనైనా ఒలింపిక్స్​ రద్దు అవ్వొచ్చు!

ABOUT THE AUTHOR

...view details