TET File in CM office : ఉపాధ్యాయుల నియామకానికి ముందు నిర్వహించే ఉపాధ్యాయ అర్హత పరీక్ష(టెట్) దస్త్రం తాజాగా సీఎం కార్యాలయానికి చేరింది. బీఈడీ పూర్తి చేసిన అభ్యర్థులు ప్రాథమిక పాఠశాలల్లో బోధించేందుకు టెట్‌లో పేపర్-1ను రాసేందుకు అవకాశం ఇవ్వాలని, ఒకసారి టెట్‌లో అర్హత సాధిస్తే ఇప్పటివరకు ఉన్న ఏడేళ్ల కాలపరిమితికి బదులు జీవితాంతం విలువ ఉండేలా మార్పు చేయాలని పాఠశాల విద్యాశాఖ ప్రతిపాదించింది. ఈ మార్పులతోపాటు టెట్‌ను నిర్వహించాలంటే ప్రభుత్వం ఆమోదం తెలపాలి. ఈ క్రమంలోనే ముఖ్యమంత్రి కేసీఆర్ ఆమోదం కోసం విద్యాశాఖ ఆ దస్త్రాన్ని మూడు రోజుల క్రితం సీఎం కార్యాలయానికి పంపింది. టెట్‌లో వచ్చే మార్కులకు ఉపాధ్యాయ నియామకాల్లో భాగంగా నిర్వహించే పరీక్షల్లో 20 శాతం వెయిటేజీ ఇచ్చి ర్యాంకు కేటాయిస్తారు.
సీఎంకు సీఎస్ నివేదిక