తెలంగాణ

telangana

ETV Bharat / city

'పాఠాలు చెప్పాల్సిన ఉపాధ్యాయుడి పాడు పనులు' - గుంటూరు జిల్లా లేటెస్ట్​ అప్​డేట్స్​

Teacher behaved rudely with students: పాఠాలు చెప్పాల్సిన ఉపాధ్యాయుడు పాడు పనులు చేశాడు. నీతులు బోధించాల్సిన నోటి నుంచి వికృత మాటలు జారాయి. అక్షరాలు చెప్పాల్సిన స్థానంలో ఉండి విద్యార్థినుల పట్ల అసభ్యంగా ప్రవర్తించాడు ఓ ప్రబుద్ధుడు. ఆగ్రహించిన తల్లిదండ్రులు ఆందోళనకు దిగారు. అసలేం జరిగిందంటే..?

teacher
teacher

By

Published : Mar 29, 2022, 6:59 PM IST

Teacher behaved rudely with students: ఏపీ గుంటూరు జిల్లా వట్టిచెరుకూరు మండలం కాట్రపాడు జెడ్పీ ఉన్నత పాఠశాలలో చిట్టిబాబు అనే వ్యక్తి ఆంగ్ల ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నాడు. చిట్టిబాబు రోజూ ఏదో విధంగా అసభ్యంగా మాట్లాడుతున్నాడని... విద్యార్థునులు వారి తల్లిదండ్రులకు చెప్పారు. గ్రామంలో తల్లిదండ్రులు పాఠశాల వద్దకు చేరుకుని ఆందోళనకు దిగారు. 9, 10 తరగతి చదువుతున్న విద్యార్థినుల పట్ల చిట్టిబాబు అసభ్యకరంగా ప్రవరిస్తూ ఇబ్బంది పెడుతున్నాడని ఆరోపించారు.

సమాచారం అందుకున్న పోలీసులు... తల్లిదండ్రులకు సర్దిచెప్పే ప్రయత్నం చేశారు. ఉపాధ్యాయుడిపై కేసు నమోదు చేయాలని తల్లిదండ్రులు డిమాండ్ చేశారు. ఉపాధ్యాయుడిని పోలీసులు పోలీస్ స్టేషన్​కు తరలించి విచారణ చేపట్టారు. ఉపాధ్యాయుడి ప్రవర్తన, జరిగిన సంఘటనను ఉన్నతాధికారులకు తెలియజేస్తామని ప్రధానోపాధ్యాయురాలు తెలిపారు.


ఇదీ చూడండి: Rahul vs Kavitha Tweet: ధాన్యం సేకరణపై రాహుల్‌ ట్వీట్‌.. కవిత కౌంటర్‌

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details