గురువు... మనకు చదువే కాదు... క్రమశిక్షణ, తోటివారితో ఎలా మెలగాలి, సమాజంలో ఎలా నడుచుకోవాలి అనే విషయాలను బోధిస్తాడు. తల్లిదండ్రుల తర్వాత మనం ఏ తప్పు చేసినా క్షమించి... దాన్ని ఎలా సరిదిద్దుకోవాలో చెప్పే మార్గదర్శి. ఆ గురువే క్రమశిక్షణ తప్పి... మృగంలా మారితే ఈయనలా ఉంటాడేమో అనే స్థాయికి దిగజారాడు ఈ ప్రబుద్ధుడు.
ఈ ద్రోణాచార్యుడు... మరీ ఇంత దారుణమా! - teacher beat students at east godavari district
చిన్నారులను ప్రధానోపాధ్యాయుడు చితకబాదిన వీడియో ఆలస్యంగా వెలుగు చూసింది. ఈ ఘటన తూర్పుగోదావరి జిల్లా కోటనందూరు మండలం సంగవక గ్రామంలో జరిగింది.
teacher beat students in east godavari district
ఏం తప్పు చేశారనో ఏమో.. ఏమీ తెలియని చిన్నారులను చితకబాదాడు స్వయానా పాఠశాల ప్రధానోపాధ్యాయుడు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. తూర్పుగోదావరి జిల్లా కోటనందూరు మండలం సంగవక గ్రామంలో ఆశ్రమ పాఠశాల విద్యార్థులను ప్రధానోపాధ్యాయుడు కర్కశంగా కొట్టిన వీడియో ఆలస్యంగా బయటకు వచ్చింది. దీనిని చూసిన తల్లిదండ్రులు అతనిపై వెంటనే చర్యలు తీసుకోవాలని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
- ఇదీ చూడండి : 'మనకున్న ఒకే ఒక్కదారి... మొక్కల్ని పెంచడం'