Jagan Reddy Palanalo Uriko Unmadi: ఏపీలో మహిళలు తమను తాము రక్షించుకునేందుకు గన్ లైసెన్స్ ఇవ్వాలని తెలుగు మహిళా ఏపీ రాష్ట్ర అధ్యక్షురాలు వంగలపూడి అనిత, మాజీ స్పీకర్ ప్రతిభా భారతి డిమాండ్ చేశారు. 'జగన్‌రెడ్డి పాలనలో ఊరికో ఉన్మాది' పేరిట రెండో సంచికను తెదేపా మహిళా నేతలు విడుదల చేశారు. జగన్ రెడ్డి పాలన అత్యాచారాల రాజ్యంగా మారిందని ప్రతిభా భారతి మండిపడ్డారు. కీచకులు చిన్నా పెద్దా తేడా లేకుండా అఘాయిత్యాలకు పాల్పడుతుంటే ప్రభుత్వంలో చలనం లేదని దుయ్యబట్టారు. జగన్‌రెడ్డికి తగ్గట్లుగానే పోలీసుల తీరూ ఉందని విమర్శించారు. మహిళా సాధికారతలో ఏపీని చంద్రబాబు మొదటి స్థానంలో నిలిపితే.. లైంగిక వేధింపుల్లో జగన్‌రెడ్డి.. ఏపీని అగ్రభాగాన నిలిపారన్నారు. అసెంబ్లీలో మహిళా భద్రతకు తీసుకునే చర్యలు తీసుకోకపోగా.. ప్రతిపక్ష నేతల కుటుంబసభ్యుల్ని కించపరిచే వేదికగా మార్చారని ప్రతిభా భారతి ఆగ్రహం వ్యక్తం చేశారు.
'జగన్‌రెడ్డి పాలనలో ఊరికో ఉన్మాది' తెదేపా రెండో సంచిక - ap latest news
Jagan Reddy Palanalo Uriko Unmadi: ఏపీలో 'జగన్‌రెడ్డి పాలనలో ఊరికో ఉన్మాది' పేరిట రెండో సంచికను తెదేపా మహిళా నేతలు విడుదల చేశారు. ఆంధ్రప్రదేశ్‌లో మహిళలు తమను తాము రక్షించుకునేందుకు గన్ లైసెన్స్ ఇవ్వాలని మాజీ స్పీకర్ ప్రతిభా భారతి డిమాండ్ చేశారు. ఏప్రిల్ మొదటి వారం నుంచి మే 12 వరకు 60 సంఘటనలు జరిగాయని తెలుగు మహిళా ఏపీ రాష్ట్ర అధ్యక్షురాలు వంగలపూడి అనిత అన్నారు. ఏపీలో రోజూ జరుగుతున్న అఘాయిత్యాలపై మాట్లాడాలంటే తమకే సిగ్గనిపిస్తోందన్నారు.
ఏపీలో రోజూ జరుగుతున్న అఘాయిత్యాలపై మాట్లాడాలంటే తమకే సిగ్గనిపిస్తోందని వంగలపూడి అనిత విమర్శించారు. ఏప్రిల్ మొదటి వారం నుంచి మే 12 వరకు 60 సంఘటనలు జరిగాయన్నారు. చిన్న బిడ్డలపై అత్యాచారం జరిగితే మంత్రి స్థాయిలో ఉన్న అంబటి రాంబాబు తన కార్యాలయంలో సెటిల్మెంట్లు చేస్తున్నారని ఆమె ఆరోపించారు. సీఎం పరదాలు దాటుకుని జనంలోకి వస్తే ఆడబిడ్డల సమస్యలు తెలుస్తాయని అనిత అన్నారు. ఎన్టీఆర్ భవన్లో జరిగిన కార్యక్రమంలో ప్రతిభా భారతి, వంగలపూడి అనిత, ఆచంట సునీత, గ్రీష్మ, అన్నబత్తుని విజయలక్ష్మి పాల్గొన్నారు.
ఇవీ చదవండి:'శాస్త్ర, సాంకేతిక రంగంలో తెలంగాణను అగ్రస్థానంలో నిలపాలన్నదే లక్ష్యం'