తెలంగాణ

telangana

ETV Bharat / city

'ప్రతీ నిరుపేదకి ఇల్లు వచ్చేంతవరకు తెదేపా పోరాడుతుంది' - l ramana

రెండు పడక గదుల ఇళ్ల నిర్మాణంలో జాప్యానికి నిరసనగా ఇందిరాపార్క్​ వద్ద తెలుగుదేశం ఆధ్వర్యంలో మహాధర్నా నిర్వహించారు. ఇళ్ల కేటాయింపుల్లో అక్రమాలు చోటుచేసుకుంటున్నాయని ఎల్​.రమణ ఆరోపించారు. ప్రతి పేద బిడ్డకు రెండు పడక గదుల ఇళ్లు వచ్చేంత వరకు తెదేపా తరఫున పోరాటం చేస్తామని తెలిపారు.

'ప్రతీ నిరుపేదకి ఇళ్లు వచ్చేంతవరకు తెదేపా పోరాడుతుంది'

By

Published : Aug 26, 2019, 1:34 PM IST

Updated : Aug 26, 2019, 3:55 PM IST

రాష్ట్రంలో రెండు పడక గదులు ఇళ్ల నిర్మాణంలో జాప్యానికి నిరసనగా తెలుగుదేశం మహాధర్నా నిర్వహించింది. హైదరాబాద్​ ఇందిరా పార్కులోని ధర్నాచౌక్​ ఇందుకు వేదికైంది. ఈ కార్యక్రమానికి తెతెదేపా అధ్యక్షుడు ఎల్​.రమణ, సీనియర్​ నేత రావుల చంద్రశేఖర్​రెడ్డి, ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు, ఇతర నేతలు, కార్యకర్తలు హాజరయ్యారు. ఇళ్ల కేటాయింపుల్లో అక్రమాలు జరుగుతున్నాయని ఎల్​.రమణ ఆరోపించారు. నాసిరకమైన నిర్మాణాలతో లబ్ధిదారులు అవస్థలు పడుతున్నారన్నారు. హామీల అమల్లో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందన్నారు. రాష్ట్రంలో పేదవారందరికి ఇళ్ల కేటాయింపులు చేసేంత వరకు పోరాడతామని హామీ ఇచ్చారు.

'ప్రతీ నిరుపేదకి ఇల్లు వచ్చేంతవరకు తెదేపా పోరాడుతుంది'
Last Updated : Aug 26, 2019, 3:55 PM IST

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details