జీహెచ్ఎంసీ ఎన్నికలు ముందస్తుగా జరగటం కొంత ఇబ్బందికి గురిచేసిందని తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు ఎల్ రమణ అభిప్రాయపడ్డారు. ఈ మేరకు ఆయన ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్‌లో ఆయన మీడియాతో మాట్లాడారు.
పార్టీ పదిహేడేళ్లుగా అధికారంలో లేకపోయినా తెదేపా తరఫున బరిలో దిగేందుకు 106మంది ముందుకు రావటం.. పార్టీ పట్ల ప్రజలకు ఉన్న నమ్మకానికి నిదర్శనంగా ఆయన పేర్కొన్నారు. గత ఎన్నికల్లో 99 స్థానాలు గెలిచిన తెరాస ఇప్పుడు 55 స్థానాలకే పరిమితం కావటం.. ఆ పార్టీ పట్ల ప్రజల్లో ఉన్న వ్యతిరేకతను చాటుతోందన్నారు. రెండు ప్రధాన పార్టీలు ప్రజా సమస్యలను విస్మరించాయని అభిప్రాయపడ్డారు. సంస్థాగతంగా పార్టీ నిర్మాణ కార్యక్రమాలను త్వరలో పూర్తి చేసుకుని.. పార్టీని బలోపేతం చేసుకుని ప్రజా సమస్యలపై పోరాడతామన్నారు.