పీవీకి భారతరత్న ఇవ్వాలని కేంద్రాన్ని తెతెదేపా అధ్యక్షుడు ఎల్.రమణ డిమాండ్ చేశారు. పీవీ నరసింహారావుకు భారతరత్న ఇచ్చి గౌరవించాలని తెదేపా మొదటి నుంచి కోరుతోందని గుర్తు చేశారు. పీవీ 16వ వర్ధంతి సందర్భంగా నెక్లెస్ రోడ్‌లోని పీవీ ఘాట్‌లో ఆయన సమాధికి పుష్పాంజలి ఘటించి నివాళులర్పించారు.
పీవీకి భారతరత్న ఇవ్వాలి: ఎల్.రమణ - తెలంగాణ వార్తలు
దివంగత ప్రధాని పీవీ నరసింహరావుకు తెదేపా నేతలు నివాళులర్పించారు. 16వ వర్ధంతి సందర్భంగా... పీవీ ఘాట్‌లో ఆయన సమాధికి పుష్పాంజలి ఘటించారు. పీవీకి భారతరత్న ఇవ్వాలని కేంద్రాన్ని తెతెదేపా అధ్యక్షుడు ఎల్.రమణ డిమాండ్ చేశారు. ఆయన చేసిన సేవలను గుర్తు చేసుకున్నారు.
l ramana
పీవీ భౌతికంగా మన మధ్య లేకపోయినా ఆయన చేపట్టిన సంస్కరణలు, చేసిన పనులు, చూపిన బాట దేశానికి గర్వకారణమన్నారు. ఈ సందర్భంగా ఆయన సేవలను గుర్తు చేసుకున్నారు.
ఇదీ చదవండి :పీవీకు భారతరత్న ఇవ్వాలని కేంద్రాన్ని కోరుతున్నాం: ఉత్తమ్