తెలంగాణ

telangana

ETV Bharat / city

Tdp Spokesperson Pattabhi: మాల్దీవులకు పట్టాభి? - తెదేపా

తెదేపా అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభి మాల్దీవులకు వెళ్లినట్లు సోషల్​ మీడియాలో వైరల్​ అవుతోంది. ఇందుకు సంబంధించిన ఫొటోలు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి.

Pattabhi in Maldives
Pattabhi in Maldives

By

Published : Oct 25, 2021, 9:00 PM IST

తెలుగుదేశం అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్ తన కుటుంబసభ్యులతో కలిసి టూర్ వేసినట్లు.. 4రోజుల అనంతరం తిరిగి రానున్నట్లు తెలుస్తోంది.

హైదరాబాద్​ శంషాబాద్​ విమానాశ్రయం నుంచి పట్టాభి మాల్దీవులు వెళ్లినట్లు కనిపిస్తున్న ఫొటోలు సోషల్​ మీడియాలో వైరల్​ అవుతున్నాయి. అయితే ఈ విషయం గురించి ఇంతవరకు కుటుంబసభ్యుల నుంచి, తెదేపా వర్గాల నుంచి ఎటువంటి సమాచారం కూడా అధికారికంగా వెలువడలేదు.

ఏపీ ముఖ్యమంత్రిపై అనుచిత వ్యాఖ్యలు చేశారనే ఆరోపణలతో బుధవారం( అక్టోబర్​ 20) అరెస్టైన పట్టాభి.. శనివారం (అక్టోబర్​ 23) సాయంత్రం రాజమహేంద్రవరం కారాగారం నుంచి బెయిల్​పై విడుదలయ్యారు. అక్కడి నుంచి విజయవాడ వస్తుండగా పొట్టిపాడు టోల్​గేట్​ వద్ద పోలీసులు అడ్డుకున్నారు. ఆయన వెంట ఉన్న వాహనాలను నిలిపేశారు. ఆ తర్వాత పట్టాభిరామ్ ఎవరికీ కనిపించలేదు.

ఇదీ చూడండి: Tdp Spokesperson Pattabhi: అజ్ఞాతంలో పట్టాభి... పోలీసులు మళ్లీ అరెస్టు చేస్తారనేనా !

ABOUT THE AUTHOR

...view details