ఆంధ్రప్రదేశ్లోని చిత్తూరు జిల్లా కుప్పం మున్సిపాలిటీ(Kuppam Elections) ఎన్నిక పోలింగ్‌లో దొంగ ఓట్లు వేసేందుకు ప్రయత్నిస్తున్న కొందరు యువకులను ఏజెంట్లు పట్టుకున్నారు. 18, 19వార్డుల్లో దొంగ ఓట్లు వేసేందుకు యత్నిస్తుండగా స్థానిక ఏజెంట్లు వారిని గుర్తించి పోలీసులకు అప్పగించారు. యువకులను కడప జిల్లా రాయచోటికి చెందిన వారిగా గుర్తించారు. మరోవైపు కుప్పంలోని కొత్తపేట జూనియర్ కళాశాల పోలింగ్ కేంద్రంలో ఉద్రిక్తత నెలకొంది. ఓటర్లు కానివారికి స్లిప్పులు ఇస్తున్నారంటూ తెదేపా శ్రేణులు నిరసన తెలియజేశాయి. దీంతో పోలీసులు ఇరు వర్గాలను చెదరగొట్టారు.
అనంతపురం జిల్లా పెనుగొండ నగర పంచాయతీ పోలింగ్(Kuppam Elections)లో స్వల్ప ఉద్రిక్తత చోటు చేసుకుంది. పోలింగ్ కేంద్రంలోకి వెళ్లేందుకు ఎంపీ గోరంట్ల మాధవ్ ప్రయత్నించగా.. అక్కడే ఉన్న తెదేపా మాజీ ఎమ్మెల్యే పార్థసారథి అడ్డుకున్నారు. దీంతో ఇరువురి మధ్య వాగ్వాదం నెలకొంది. పోలీసులు వారికి సర్దిజెప్పి అక్కడి నుంచి పంపించారు.
వీడియోలను బయటపెట్టిన తెదేపా..