ఆంధ్రప్రదేశ్ తిరుపతిలో తిరుపతి అర్బన్ ఎస్పీ కార్యాలయం ఎదుట తెదేపా నేతలు ధర్నాకు దిగారు. వైకాపా నేతలు దొంగ ఓట్లు వేస్తున్నారంటూ ఆరోపించారు. ఇతర ప్రాంతాల నుంచి బస్సులు, కార్లలో తిరుపతి వచ్చిన వైకాపా మద్దతుదారులు.. దొంగ ఓట్లు వేస్తున్నారని ఆందోళనకు దిగారు.
తిరుపతిలో ఎస్పీ కార్యాలయం ఎదుట.. తెదేపా నేతల ధర్నా
తిరుపతిలో ఎస్పీ కార్యాలయం ముందు తెదేపా నేతలు ధర్నాకు దిగారు. వైకాపా నేతలు దొంగ ఓట్లు వేసేందుకు పెద్దఎత్తున ఇతర ప్రాంతాల నుంచి మనుషులను తీసుకొచ్చారంటూ ఆందోళన చేపట్టారు.
తిరుపతి ఉపపోరు, తెదేపా ఆందోళన
పీఎల్‌ఆర్ గ్రాండ్ ఫంక్షన్ హాలు వద్దకు చౌడేపల్లి నుంచి వచ్చిన కొందరిని తెదేపా నేతలు పట్టుకుని మీడియాకు చూపించారు. ఎస్పీ కార్యాలయం ముందు తెదేపా నేతలు ధర్నా చేస్తున్న సమయంలో అటుగా వెళ్తున్న ఓ బస్సును తెదేపా శ్రేణులు ఆపి పోలీసులకు అప్పగించారు. ఇతర ప్రాంతాల నుంచి ఓటర్లు బహిరంగ సభకు వచ్చినట్టు తిరుపతికి వస్తున్నారని ఆగ్రహించారు.
ఇదీ చదవండి:సాగర్ పోరు: పలు కేంద్రాల్లో మొరాయిస్తున్న ఈవీఎంలు