తెలంగాణ

telangana

రైతులను ఆదుకోవాలని తెదేపా నిరసన ర్యాలీ

By

Published : Nov 30, 2020, 1:07 PM IST

భారీ వర్షాలకు నష్టపోయిన రైతులను ఆదుకోవాలని ఆంధ్రప్రదేశ్​ సచివాలయం అగ్నిమాపక కేంద్రం నుంచి తెదేపా ర్యాలీ చేపట్టింది. వర్షాలకు దెబ్బతిన్న పంటకంకుల్ని పట్టుకుని నిరసన చేపట్టారు.

tdp-protest-at-sachivalya-fire-station-to-solve-problems-on-flood-effected-farmers
రైతులను ఆదుకోవాలని తెదేపా నిరసన ర్యాలీ

ఆంధ్రప్రదేశ్​ సచివాలయం అగ్నిమాపక కేంద్రం నుంచి తెదేపా నేతలు నిరసన ర్యాలీ చేపట్టారు. అసెంబ్లీ సమావేశాల తొలిరోజు సందర్భంగా వెంకటపాలెంలో ఎన్టీఆర్‌ విగ్రహానికి నివాళులర్పించి.. నిరసనగా అసెంబ్లీకి పయనమయ్యారు. వర్షాలకు దెబ్బతిన్న పంట కంకుల్ని పట్టుకుని నిరసన చేపట్టారు. వరదల కారణంగా నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేశారు. టిడ్కో గృహాలను లబ్ధిదారులకు అందజేయాలని డిమాండ్ చేశారు.

ఎకరాకు రూ.25 వేలు ఇవ్వాలి

వైకాపా ప్రభుత్వం రైతు వ్యతిరేక ప్రభుత్వమని తెదేపా ఎమ్మెల్యే అచ్చెన్నాయుడు విమర్శించారు. అమరావతి రైతులకు మద్దతు తెలిపి.. తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌తో కలిసి వెంకటపాలెం బీసీ కాలనీలో ఎన్టీఆర్​ విగ్రహానికి నివాళులర్పించారు. పంట నష్టపోయిన రైతులకు ఎకరాకు 25 వేల రూపాయలు ఇవ్వాలని డిమాండ్‌ చేశారు.

ఇదీ చదవండి:కల్లంలో నీళ్లు... కళ్లలో దుఃఖం

ABOUT THE AUTHOR

...view details