తెలంగాణ

telangana

ETV Bharat / city

Chandrababu On Debts: 'జగన్​ చేసిన అప్పులు... ప్రజలే తీర్చాలి' - ఏపీ ప్రభుత్వ అప్పులపై చంద్రబాబు ధ్వజం

Chandrababu On Debts: జగన్ పాలనలో రాజ్యంగ వ్యవస్థలన్నీ విధ్వంసమయ్యాయని.. ఏపీ భవిష్యత్తు అంధకారమైందని తెదేపా అధినేత చంద్రబాబు విమర్శించారు. ఏపీలోని మేధావులు, యువత.. ప్రజల్లో చైతన్యం తేవాలన్నారు.

chandrababu
chandrababu

By

Published : Feb 11, 2022, 2:47 PM IST

Chandrababu On Debts: జగన్ అధికారంలోకి వచ్చాక రాజ్యాంగ వ్యవస్థల్ని విధ్వంసం చేశారని తెదేపా అధినేత చంద్రబాబు విమర్శించారు. ఏపీ భవిష్యత్తును అంధకారంలోకి నెట్టారని మండిపడ్డారు. ఏపీ పరిస్థితిపై ప్రజలు, ఉద్యోగులు ఆలోచించుకోవాలన్న ఆయన.. ప్రజల్లో చైతన్యం వస్తే తప్ప ప్రభుత్వ అరాచకాలకు అడ్డుకట్టు వేయలేమన్నారు.

'తాకట్టు పెట్టడమే పని '

వైకాపా ప్రభుత్వం.. తాకట్టు పెట్టడమే పనిగా పెట్టుకుందని.. ప్రజలపై విపరీతంగా పన్నుల భారం మోపుతోందని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. చివరికి చెత్త పైనా పన్ను వేసే పరిస్థితి వచ్చిందని.. ఆఖరికి ప్రైవేటు ఆస్తులనూ తాకట్టు పెడతారని ఎద్దేవా చేశారు. జగన్ చేసే అప్పులు ఆకాశం నుంచి వచ్చి ఎవ్వరూ కట్టరని.. రాష్ట్ర ప్రజలే కట్టాలని.. ఈ అంశంపై ఆలోచన చేయాలన్నారు. ఏపీ ఆర్థిక వ్యవస్థపై వైకాపా సర్కారు శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు.

ఇదీచూడండి:MLC Ashok Babu Arrest: అశోక్‌బాబు అరెస్ట్‌ను ఖండించిన తెదేపా నేతలు

ABOUT THE AUTHOR

...view details