విశాఖ ఫార్మా సిటీలో పేలుడు గురించి తెలిసి షాక్‌కు గురైనట్లు తెలుగుదేశం అధినేత చంద్రబాబు తెలిపారు. ఘటనా దృశ్యాలు భయంకరంగా కనిపించాయన్న ఆయన.. కార్మికులు అంతా సురక్షితంగా ఉండాలని దేవుడిని ప్రార్థిస్తున్నట్లు చెప్పారు.
విశాఖ ఫార్మాసిటీ అగ్నిప్రమాదంపై చంద్రబాబు, లోకేశ్ దిగ్భ్రాంతి - విశాఖ ఫార్మా సిటీ అగ్నిప్రమాదంపై లోకేశ్ స్పందన
విశాఖ ఫార్మా సిటీలో అగ్నిప్రమాదంపై తెదేపా అధినేత చంద్రబాబు, పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఘటనా దృశ్యాలు తీవ్రంగా కలిచివేశాయని తెలిపారు. కార్మికులంతా సురక్షితంగా ఉండాలని ఆకాంక్షించారు.
chandrababu
ఫార్మా సిటీలో పేలుడు దృశ్యాలు బాధ కలిగించాయని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ తెలిపారు. ప్రమాద బాధితులకు అధికారులు అన్ని విధాలా అండగా ఉంటారని ఆశిస్తున్నట్లు చెప్పారు. కార్మికులకు సురక్షితంగా ఉండాలని ఆకాంక్షించారు.
ఇదీ చదవండి:విశాఖ ఫార్మాసిటీలో భారీ అగ్నిప్రమాదం.. ఎగసిపడ్డ అగ్నికీలలు