మాజీ మంత్రి అచ్చెన్నాయుడుని అరెస్టు చేయటంపై తెదేపా అధినేత చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. అచ్చెన్నాయుడిని కిడ్నాప్ చేశారని ఆరోపించారు. దీనికి ఏపీ ముఖ్యమంత్రి బాధ్యత వహించాలని... హోంమంత్రి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.
అచ్చెన్నాయుడిని కిడ్నాప్ చేశారు: చంద్రబాబు - chandrbabu raect on achennayudu arrest
మాజీ మంత్రి అచ్చెన్నాయుడిని అనిశా అదుపులోకి తీసుకోవటంపై చంద్రబాబు ఖండించారు. అచ్చెన్నాయుడిని కిడ్నాప్ చేశారని ఆరోపించారు. ఇది జగన్ కుట్ర అని ధ్వజమెత్తారు.
chandrababu
అచ్చెన్నాయుడి ఆచూకీని డీజీపీ వెల్లడించాలన్నారు. ఆయన అరెస్టును బలహీనవర్గాలపై దాడిగా చంద్రబాబు అభివర్ణించారు. అసెంబ్లీ సమావేశాలకు ముందు అచ్చెన్నాయుడి కిడ్నాప్ జగన్ కుట్ర అని ధ్వజమెత్తారు.
ఇదీ చదవండి:మాజీ మంత్రి అచ్చెన్నాయుడు అరెస్టు