పరిపాలన వికేంద్రీకరణ, సీఆర్డీఏ రద్దు బిల్లులు శాసనమండలిలో ఒకసారి సెలక్ట్ కమిటీకి వెళ్లాక... మళ్లీ అసెంబ్లీలో ఎలా ప్రవేశపెడతారని తెలుగుదేశం అధినేత చంద్రబాబు ధ్వజమెత్తారు. అది రాజ్యాంగ విరుద్ధమన్న ఆయన.. బిల్లులపై స్పష్టత వచ్చేంతవరకు ముందుకు వెళ్లబోమని అడ్వకేట్ జనరల్ హైకోర్టుకు చెప్పారన్నారు. బిల్లులపై తమ వైఖరిలో ఎలాంటి మార్పు లేదని.. శాసన మండలిలోనూ తమ సభ్యులు పోరాడతారని స్పష్టం చేశారు. ఏపీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ రాష్ట్ర ప్రయోజనాలను దెబ్బతీసేలా ఉందని అన్నారు.
ఇదే నా మీ గొప్ప..?
ప్రభుత్వాన్ని ఆర్థికమంత్రి పొగడ్తలతో ముంచెత్తినా...లెక్కల్లో పొంతనేదని చంద్రబాబు ప్రశ్నించారు. అది చేశాం.. ఇది చేశామని చెప్పుకుంటున్న సర్కారు... సంవత్సర కాలంలో అప్పులే తెచ్చింది తప్ప... ఆదాయ మార్గాలు అన్వేషించలేదన్నారు. 2018-19లో మూలధన వ్యయం రూ.19,976 కోట్లు ఉంటే.. వైకాపా అధికారంలోకి వచ్చాక రూ.12,845 కోట్లు మాత్రమే ఖర్చు చేశారని అన్నారు. ఈ ప్రభుత్వం వచ్చాక.. అప్పులు 3.02 లక్షల కోట్లకు పెరిగాయని.. వచ్చే ఏడాది రూ.3.50 లక్షల కోట్లకు చేరుతాయని చంద్రబాబు పేర్కొన్నారు. 2018-19లో రాష్ట్ర ఆదాయం రూ.1,14,670 కోట్లు కాగా.. 2019-20లో రాష్ట్ర ఆదాయం రూ.1,10,800 కోట్లని మండిపడ్డారు.
దేవుడు స్క్రిప్ట్ రాస్తూనే ఉన్నాడు