నిర్విరామంగా పోరాడున్నఏపీలోని అమరావతి రైతుల ఉద్యమం అభినందనీయం అని తెదేపా జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు కొనియాడారు. ప్రజా రాజధాని కోసం అమరావతి రైతులు 32,323 ఎకరాలు త్యాగం చేశారని ఆయన గుర్తు చేశారు.
CHANDRABABU: అణచివేయాలని చూస్తే.. మరింత ఉద్యమిస్తాం
600రోజుల అమరావతి రైతుల ఉద్యమం చారిత్రాత్మకమని తెదేపా జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు అభినందించారు. రాజధాని కోసం పోరాటం చేస్తున్న దళిత రైతులపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు పెట్టడంపై మండిపడ్డారు. అమరావతి నిర్మాణానికి 32వేల 323 ఎకరాల భూమిని రైతులు త్యాగం చేశారని గుర్తు చేశారు.
రైతులు, రైతు కూలీల న్యాయపోరాటానికి నా సంపూర్ణ మద్దతు. అమరావతి ఆంధ్రుల రాజధాని మాత్రమే కాదు.. ఆంధ్రులకు రూ.2 లక్షల కోట్ల సంపద సృష్టించే కేంద్రం. వైకాపా చేస్తున్నది అమరావతిపై దాడికాదు.. రాష్ట్ర సంపదపై దాడి. విద్వేషంతో ప్రజా రాజధానిని జగన్ ధ్వంసం చేస్తున్నారు. జగన్ వల్ల 139 సంస్థలు అమరావతి ప్రాజెక్టు నుంచి వెనక్కి వెళ్లాయి. అమరావతి అంతానికి వైకాపా చేయని కుట్ర లేదు. రైతు ఉద్యమాన్ని అణచివేయాలని చూస్తే.. మరింత ఉద్ధృతమైంది. -చంద్రబాబు
ఇదీ చూడండి:Kidnap: నిర్మల్లో స్థిరాస్తి వ్యాపారి కిడ్నాప్ కలకలం.. అందుకోసమేనా?