"ఫ్యాన్‌కి ఓటేస్తే నిరుద్యోగ సమస్య పరిష్కరిస్తానన్న సీఎం జగన్, అదే ఫ్యాన్‌కు నిరుద్యోగులు ఉరేసుకొనే దుస్థితి కల్పించారు" అని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ధ్వజమెత్తారు. గుంటూరులోని పార్టీ కేంద్ర కార్యాలయం ఎన్టీఆర్ భవన్లో నిరుద్యోగ యువతతో లోకేశ్ సమావేశమయ్యారు.
LOKESH: 'ఓటేసిన ఫ్యాన్‌కే ఉరేసుకొనే దుస్థితి కల్పించారు' - NARA LOKESH FIRES ON JAGAN
జాబ్ క్యాలెండర్ పేరిట జాదూ క్యాలెండర్ విడుదల చేశారని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ఏపీ ప్రభుత్వంపై మండిపడ్డారు. బై బై బాబు అనే నినాదంతో చంద్రబాబుని ఓడించామనుకుని.. రాష్ట్రాన్నే ఓడించారని వ్యాఖ్యానించారు. ఏపీ ప్రభుత్వ తీరుతో.. పరిశ్రమలన్నీ బైబై ఆంధ్రప్రదేశ్ అంటున్నాయని ఎద్దేవా చేశారు.
nara lokesh
ఈ కార్యక్రమంలో నిరుద్యోగుల భవిష్యత్తు ఉద్యమ కార్యాచరణపై చర్చించారు. ఖాళీగా ఉన్న 2.30 లక్షల ఉద్యోగాలకు బదులు 10 వేల పోస్టులే ఇచ్చి పండుగ చేసుకోవాలని అంటున్నారని మండిపడ్డారు. జగన్ మెడలు వంచైనా 2.30 లక్షల ఉద్యోగాలు భర్తీ చేసేలా పోరాడతామని లోకేశ్ చెప్పారు.
ఇవీచూడండి:'దేశంలో క్లిష్ట పరిస్థితులకు కారకులెవరో ప్రజలకు తెలుసు'