ఏపీలోని కడప జిల్లా గోపవరం మండలం బ్రాహ్మణపల్లె తెలుగుదేశం పార్టీకి చెందిన ఎంపీటీసీ సభ్యురాలు ధనలక్ష్మి కౌంటింగ్ హాల్(MPTC ZPTC results 2021)లో అస్వస్థతకు గురయ్యారు. ఆమె ఎన్నికల కౌంటింగ్ లెక్కింపు(MPTC ZPTC results 2021) ప్రారంభం నుంచి విపరీతమైన ఒత్తిడికి గురయ్యారు. గెలిచినట్లు ఫలితం తెలియడంతో మరింత ఒత్తిడికి లోనయ్యారు. ఆమెను కౌంటింగ్ హాల్లో నుంచి బయటికి తీసుకువచ్చారు. అనంతరం వైద్య సిబ్బంది ఆమెను పరిక్షించగా బీపీ ఎక్కువగా ఉన్నట్టు నిర్ధారించారు. అనంతరం ఆమెను 108 వాహనంలో ఆస్పత్రికి తరలించారు.
MPTC ZPTC results 2021: గెలిచినప్పటికీ అస్వస్థతలో ఎంపీటీసీ.. ఉత్కంఠ తట్టుకోలేకే..! - కడప ఓట్ల ఎన్నికల లెక్కింపు
ఏపీలో ఎన్నికల(MPTC ZPTC results 2021) కౌంటింగ్ మొదలైనప్పటి నుంచి ఉత్కంఠ కొనసాగుతూనే ఉంది. ఫలితం ఎలా వస్తుందోనన్న టెన్షన్ ఆమెను వెంటాడింది. తొలి రౌండ్ నుంచి ఆమె ఆధిక్యంలో కొనసాగుతూనే ఉన్నారు. అయినా ఫలితం ఎలా ఉంటుందోనని ఆమె ఆలోచిస్తూనే ఉంది. ఉదయం నుంచి ఒత్తిడిలో ఉన్న ఆమె.. గెలిచినప్పటికీ ఆ వార్త విని మరింత ఉద్వేగానికి లోనై తీవ్ర అస్వస్థతకు లోనయ్యారు.
MPTC ZPTC results 202