తెలంగాణ

telangana

ETV Bharat / city

'ఫోన్​ ట్యాపింగ్​పై దర్యాప్తు జరపండి'.. అమిత్‌షాకు తెదేపా ఎంపీల లేఖ - అమిత్‌షాకు తెదేపా ఎంపీల లేఖ

TDP MPs letter to Amit shah: కేంద్ర హోంమంత్రి అమిత్‌షాకు తెదేపా ఎంపీలు రామ్మోహన్‌నాయుడు, కనకమేడల రవీంద్రకుమార్‌.. లేఖలు రాశారు. ప్రశ్నపత్రాల లీకేజీ కేసులో మాజీ మంత్రి నారాయణ అరెస్ట్‌, ఫోన్ల ట్యాపింగ్‌ వంటి విషయాల్లో చిత్తూరు ఎస్పీ పాత్ర అనుమానాస్పదంగా ఉందని లేఖల్లో ఎంపీలు పేర్కొన్నారు.

'ఫోన్​ ట్యాపింగ్​పై దర్యాప్తు జరపండి'.. అమిత్‌షాకు తెదేపా ఎంపీల లేఖ
'ఫోన్​ ట్యాపింగ్​పై దర్యాప్తు జరపండి'.. అమిత్‌షాకు తెదేపా ఎంపీల లేఖ

By

Published : May 17, 2022, 8:18 AM IST

కేంద్ర హోంమంత్రి అమిత్‌షా, కేంద్ర సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ మంత్రి జితేందర్‌సింగ్‌కు తెదేపా ఎంపీలు కింజరాపు రామ్మోహన్‌నాయుడు, కనకమేడల రవీంద్రకుమార్‌ వేర్వేరుగా లేఖలు రాశారు. పదో తరగతి ప్రశ్నపత్రాల లీకేజీ కేసులో మాజీ మంత్రి నారాయణ అరెస్టు, ఫోన్ల ట్యాపింగ్‌తో పాటు మాజీ మంత్రి వివేకానందరెడ్డి హత్య కేసుపై పలు అనుమానాలను లేఖల్లో పేర్కొన్నారు. వివేకా హత్య కేసు విచారణ జరుగుతున్న నేపథ్యంలో కడపలో సీబీఐ బృందానికి భద్రత పెంచాలని ఎంపీలు కోరారు.

సీబీఐ అధికారులకు బెదిరింపుల అంశాన్ని లేఖల్లో ప్రస్తావించారు. నారాయణ అరెస్ట్‌లో నిబంధనలు పాటించలేదన్నారు. ఈ విషయంలో చిత్తూరు ఎస్పీ పాత్ర అనుమానాస్పదంగా ఉందని ఎంపీలు తమ లేఖల్లో పేర్కొన్నారు.

ABOUT THE AUTHOR

...view details