TDP MP Kanaka on Casino: ఆంధ్రప్రదేశ్లోని కృష్ణా జిల్లా గుడివాడలో క్యాసినో ఘటనపై తెలుగుదేశం ఎంపీ కనకమేడల రవీంద్రకుమార్ రాజ్యసభలో ప్రస్తావించారు. పరిశ్రమల స్థాపనతో యువతకు ఉపాధి కల్పించలేని రాష్ట్ర ప్రభుత్వం అసాంఘిక చర్యలతో పబ్బం గడుపుతోందని విమర్శించారు. పోలవరం, అమరావతి వంటి ప్రాజెక్టుల విషయంలో మాట తప్పుతూనే ఉందని ఆరోపించారు.
TDP MP Kanakamedala: రాజ్యసభలో గుడివాడ క్యాసినో ఘటన ప్రస్తావన.. - రాజ్యసభలో గుడివాడ క్యాసినో ఘటన ప్రస్తావన
TDP MP Kanaka on Casino: గుడివాడలో జరిగిన క్యాసినో ఘటనపై తెలుగుదేశం ఎంపీ కనకమేడల రవీంద్రకుమార్ రాజ్యసభలో ప్రస్తావించారు. పరిశ్రమల స్థాపనతో యువతకు ఉపాధి కల్పించలేని ఏపీ ప్రభుత్వం... అసాంఘిక చర్యలతో పబ్బం గడుపుతోందని విమర్శించారు.
![TDP MP Kanakamedala: రాజ్యసభలో గుడివాడ క్యాసినో ఘటన ప్రస్తావన.. TDP MP Kanaka on Casino](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-14394914-480-14394914-1644219792099.jpg)
రాజ్యసభలో గుడివాడ క్యాసినో ఘటన ప్రస్తావన
కనకమేడల మాట్లాడుతున్న సమయంలో వైకాపా ఎంపీలు అడ్డుపడటంతో వారిని రాజ్యసభ డిప్యూటీ ఛైర్మన్ వారించారు. అనంతరం ఇచ్చిన సమయం అయిపోయిందంటూ మైక్ కట్ చేశారు. అంతకముందు కనమేడల మాట్లాడుతూ.. ‘‘రాష్ట్రం మాదకద్రవ్యాలు, గంజాయికి కేంద్రంగా మారింది. రాష్ట్రంలో ఇసుక, మద్యం మాఫియాలు రెచ్చిపోతున్నారు. అన్యాయాలపై పోరాడితే ప్రతిపక్ష నేతలు, పార్టీ కార్యాలయాలపై దాడులు చేస్తున్నారు’’అని కనకమేడల అన్నారు.
ఇదీ చదవండి:Revanth Reddy Protest: 'ఆర్‌ఎస్‌ఎస్, భాజపా కుట్రలను కేసీఆర్ అమల్లోకి తెస్తున్నారు'