తెలంగాణ

telangana

ETV Bharat / city

బురద నీటిలో కూర్చొని నిరసన... ఎందుకంటే..? - Nellore District Latest News

TDP leaders protest: గ్రామానికి వెళ్లేందకు రోడ్డు సరిగా లేదని తెదేపా నాయకులు నిరసనకు దిగారు. ఏపీ నెల్లూరు జిల్లా కావలి మండలం తుమ్మలపెంట రహదారిలో బురద నీటిలో కూర్చుని ధర్నా చేపట్టారు. వెంటనే రహదారికి మరమ్మతులు చేప్టటాలని వారు డిమాండ్ చేశారు.

TDP leaders protest
TDP leaders protest

By

Published : Oct 3, 2022, 7:15 PM IST

TDP leaders protest: ఆంధ్రప్రదేశ్​ నెల్లూరు జిల్లా కావలి మండలం తుమ్మలపెంట రోడ్డులో తెదేపా నాయకులు వినూత్నంగా నిరసన తెలిపారు. తుమ్మలపెంట రోడ్డు దుస్థితిపై ఆర్​అండ్​బీ అధికారులకు విన్నవించుకుంటే సెప్టెంబర్​ నెలాఖరు వరకు గడువు అడిగారని.. అయినా ఇప్పటివరకు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంతో తెదేపా ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు. కావలి నియోజకవర్గ తెదేపా ఇంఛార్జ్ మాలేపాటి సుబ్బానాయుడు ఆధ్వర్యంలో తుమ్మలపెంట రోడ్డులోని బురదలో కూర్చుని వారు నిరసన తెలిపారు.

తుమ్మలపెంట రోడ్డును చూస్తుంటే నరకానికి దారి ఇది అన్నట్లుగా కనిపిస్తోందని సుబ్బానాయుడు అన్నారు. నిత్యం వేలాది మంది ప్రజలు ఈ రోడ్డుపై ప్రయాణిస్తున్నారని చెప్పారు. నేషనల్ హైవేకు దగ్గరగా ఉందని మత్స్యకారులకు అత్యవసరమైన రహదారి అని తెలిపారు. పర్యాటక కేంద్రానికి వెళ్లే రోడ్డు కాబట్టి.. దీనిని త్వరితగతిన నిర్మాణం చేపట్టాలని ఆయన డిమాండ్ చేశారు.

తెదేపా ప్రభుత్వం హయాంలోనే ఈ రోడ్డు ఎన్​డీబీ నిధుల కింద మంజూరు అయిందని.. దీనికితోడుగా మరో రెండు రోడ్ల పనులు జరుగుతున్నాయని అన్నారు. కేవలం దీనిని శాసనసభ్యులు ప్రతాప్ కుమార్ రెడ్డి ఎందుకు ఆటంకం కలిగిస్తున్నారో అర్థం కావడం లేదని విమర్శించారు. ధైర్యముంటే తుమ్మలపెంట రోడ్డులోని అభివృద్ధిపై చర్చకు రమ్మని మాలేపాటి సుబ్బానాయుడు సవాల్​ విసిరారు.

బురద నీటిలో కూర్చొని నిరసన... ఎందుకంటే..?

ఇవీ చదవండి:పోలీసులు ఆపారని తన బైక్‌ను తానే తగులబెట్టిన వ్యక్తి

థాయిలాండ్ మహిళకు పూనిన కాళీమాత.. భక్తులకు అభయం.. దర్శనానికి స్థానికుల క్యూ..

ABOUT THE AUTHOR

...view details