TDP Leaders: ఏపీలో ముఖ్యమంత్రి జగన్ చిత్రపటానికి తెదేపా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు మద్యంతో అభిషేకం చేసి వినూత్నంగా నిరసన తెలిపారు. 'మద్య నిషేదం హామీ గోవిందా గోవిందా' అని నినాదాలు చేశారు. నాటుసారా, జే-బ్రాండ్ మద్యం వల్ల వందలాది మంది చనిపోతున్నారంటూ వరుసగా ఐదోరోజూ లోకేష్ ఆధ్వర్యంలో తెదేపా శాసనసభాపక్షం నిరసన వ్యక్తం చేసింది.
కరోనా మరణాలతో పోటీగా నాటుసారా మరణాలు
సచివాలయం అగ్నిమాపక కేంద్రం నుంచి నిరసన ర్యాలీ నిర్వహించారు. నాటుసారా, జే-బ్రాండ్‌తో మద్యంతో జగన్ రెడ్డి జనాల ప్రాణాలు తీస్తున్నారని ప్లకార్డులు ప్రదర్శించారు. రాష్ట్రాన్ని జే బ్రాండ్ మద్యం, కల్తీసారా, గంజాయి, నార్కోటిక్స్ డ్రగ్స్ ముంచెత్తుతున్నాయని నేతలు మండిపడ్డారు. రాష్ట్రంలో కరోనా మరణాలతో పోటీగా నాటుసారా మరణాలు ఉన్నాయని ఆరోపించారు.
సీఎం రాజీనామా చేయాలి..