తెలంగాణ

telangana

By

Published : May 24, 2021, 9:59 AM IST

ETV Bharat / city

ఆస్పత్రులను సందర్శించకుండా.. తెదేపా నేతల గృహ నిర్బంధం

ఏపీలోని కొవిడ్‌ ఆస్పత్రుల్లో బాధితులను పరామర్శించేందుకు బయలుదేరిన తెదేపా నేతలను పోలీసులు ఎక్కడికక్కడ అడ్డుకున్నారు. వారిని వారివారి ఇళ్ల వద్దనే అడ్డుకొని గృహ నిర్బంధం చేశారు.

tdp leaders detention in ap
ఏపీలో తెదేపా నేతల గృహ నిర్బంధం

ఆంధ్రప్రదేశ్‌లోని కొవిడ్ ఆస్పత్రుల్లో సౌకర్యాలను పరిశీలించేందుకు తెలుగుదేశం పిలుపునిచ్చిన 'కొవిడ్ బాధితులకు భరోసా' కార్యక్రమాన్ని పోలీసులు అడ్డుకున్నారు. ఆస్పత్రుల సందర్శనకు వెళ్తున్న తెదేపా నేతలను గృహ నిర్బంధం చేశారు.

తూర్పుగోదావరి జిల్లా అనపర్తి మాజీ ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి, పాలకొల్లులో నిమ్మల రామానాయుడు, దెందులూరులో చింతమనేని ప్రభాకర్‌, కడప జిల్లాలో ఎమ్మెల్సీ బీటెక్ రవిని హౌస్ అరెస్ట్ చేశారు. కడప పార్లమెంటరీ అధ్యక్షులు లింగారెడ్డి, ఏలూరు పార్లమెంటరీ పార్టీ అధ్యక్షులు గన్ని వీరాంజనేయులు, ఏలూరు నియోజకవర్గ ఇన్ఛార్జ్ బడేటి రాధాకృష్ణలను సైతం పోలీసులు గృహనిర్బంధం చేశారు.

ఇదీ చదవండి:ఆక్సిజన్‌ ఫ్లో మీటర్లకు భారీ కొరత.. ఇవి లేకపోతే అంతరాయమే!

ABOUT THE AUTHOR

...view details