తెలంగాణ

telangana

ETV Bharat / city

'మీ చిన్నాన్నను చంపినవారు నీకు రెండు కళ్లా..?' జగన్​పై తెదేపా ఫైర్ - ys viveka murder case

TDP fires on CM Jagan: ఏపీ మాజీమంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్యకేసు విచారణను.. సీఎం జగన్‌ తప్పుదోవ పట్టిస్తున్నారని తెదేపా నేతలు ఆరోపించారు. కేసులో వాస్తవాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నా.. ముఖ్యమంత్రి జగన్​ ఎందుకు మౌనం వహిస్తున్నారని నిలదీశారు.

tdp on cm jagan
tdp

By

Published : Mar 2, 2022, 4:33 PM IST

TDP fires on CM Jagan: ఏపీ మాజీమంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్యకేసు విచారణను.. సీఎం జగన్‌ తప్పుదోవ పట్టిస్తున్నారని తెదేపా నేతలు ఆరోపించారు. ఇందుకోసం ముఖ్యమంత్రి జగన్​ విశ్వప్రయత్నాలు చేస్తున్నారని మండిపడ్డారు. కడప జిల్లా జమ్మలమడుగులోని పార్టీ కార్యాలయంలో జరిగిన సమావేశంలో మీడియాతో మాట్లాడారు.

సీఎం ఎందుకు మౌనం వహిస్తున్నారు: సోమిరెడ్డి
వైెఎస్​ వివేకా హత్య కేసులో వాస్తవాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నా.. ముఖ్యమంత్రి జగన్ ఎందుకు మౌనం వహిస్తున్నారని తెదేపా నేత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ప్రశ్నించారు. సీఎం జగన్ చిన్నాన్నను.. సొంత ఇంట్లోనే కిరాతకంగా హత్య చేస్తే, దానిని కప్పిపుచ్చేందుకు ప్రయత్నించారని మండిపడ్డారు. వివేకా హత్య కేసులో నిందితులు ఏపీ సీఎం కార్యాలయంలో ఉండటం ఏమిటని అనుమానం వ్యక్తం చేశారు. హత్య చేసిన వారిని వెనకేసుకువస్తే ప్రజలకు రక్షణగా ఎవరుంటారని నిలదీశారు. ఏపీ ప్రతిష్టను దిగజార్చేలా ముఖ్యమంత్రి వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

అవినాష్​ రెడ్డిని అప్పుడెందుకు సస్పెండ్ చేయలేదు: బీటెక్ రవి
వివేకా హత్యకేసులో జగన్‌ను అవినాష్‌రెడ్డి బ్లాక్‌మెయిల్‌ చేశారని తెదేపా నేత బీటెక్ రవి ఆరోపించారు. హత్యకేసును సీబీఐకి అప్పగిస్తే.. అవినాష్​రెడ్డి భాజపాలోకి వెళ్తారని చెప్పినవారు.. ఆనాడే ఎందుకు సస్పెండ్ చేయలేదని నిలదీశారు. సీబీఐ విచారణ జరిపించాలని జగన్‌ వద్దకు వివేకా కుమార్తె సునీత వెళ్తే.. కేసు ఉపసంహరించుకోకపోతే ఆమె భర్తపైనే కేసుపెడతామని బెదిరించలేదా? అని ప్రశ్నించారు.

కేసును తప్పుదోవ పట్టించేందుకు సీఎం ప్రయత్నాలు: చినరాజప్ప
వివేకానందరెడ్డి కుమార్తె సునీత వెనుక చంద్రబాబు ఉన్నారన్న సజ్జల వ్యాఖ్యలను ఖండిస్తున్నట్లు.. తెదేపా నేత నిమ్మకాయల చినరాజప్ప తెలిపారు. సీబీఐ విచారణలో అవినాష్‌రెడ్డి, భాస్కర్‌రెడ్డి పేర్లు బయటకొచ్చాయన్న ఆయన.. హత్య కేసును పక్కదారి పట్టించడానికే సజ్జల వ్యాఖ్యలు చేశారని అన్నారు. కేసును తప్పుదోవ పట్టించేందుకు జగన్ విశ్వప్రయత్నాలు చేస్తున్నారని ఆరోపించారు.

ముఖ్యమంత్రిని అరెస్టు చేయాలి: గోరంట్ల
వైఎస్ వివేకా హత్యకేసు విచారణను ముఖ్యమంత్రి జగన్‌ తప్పుదోవ పట్టిస్తున్నారని.. తెదేపా ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి ఆరోపించారు. వెంటనే ముఖ్యమంత్రిని అరెస్టు చేయాలని డిమాండ్‌ చేశారు. వైఎస్​ఆర్ సకుటుంబ సపరివార సమేతంగా చేసిన ఈ హత్య కుట్రను.. పూర్తిగా వెలికితీసేందుకు సీబీఐ తగిన చర్యలు తీసుకోవాలని కోరారు.

నిందితులు నీకు రెండు కళ్లా..?
వైఎస్​ వివేకానంద రెడ్డి హత్య కేసులో.. అవినాష్ రెడ్డి కుటుంబాన్ని అరెస్టు చేసి, సీఎం జగన్​పై చర్యలు తీసుకోవాలని కడప పార్లమెంటు తెదేపా అధ్యక్షుడు మల్లెల లింగారెడ్డి డిమాండ్ చేశారు. 'మీ చిన్నాన్న హత్య కేసులోని నిందితులు నీకు రెండు కళ్లా..?' అని ముఖ్యమంత్రిని ప్రశ్నించారు.

ABOUT THE AUTHOR

...view details