ఏపీలోని ప్రకాశం జిల్లాలో పాదయాత్ర చేస్తున్న అమరావతి రైతులపై పోలీసులు లాఠీఛార్జ్(Lottie charge on farmers) చేయడంపై తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్(nara lokesh comments), తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసుల తీరు దారుణమని లోకేశ్ మండిపడ్డారు. బాధ్యులైన పోలీసులపై చర్యలు తీసుకోవాలని, గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించాలని డిమాండ్ చేశారు. హైకోర్టు అనుమతితో చేస్తున్న పాదయాత్రకు ఆంక్షలు విధించడమేంటని ప్రశ్నించారు.
న్యాయస్థానం ఆదేశాలను ధిక్కరిస్తున్నారు..
మహాపాదయాత్రలో వస్తున్న ప్రజాస్పందన చూసి సీఎం జగన్ రెడ్డి(ap cm jagan latest news)కి చలిజ్వరం పట్టుకుందని అచ్చెన్నాయుడు అన్నారు. రైతుల మహాపాదయాత్రకు ఎన్నికల కోడ్(election code of conduct 2021) ఆపాదించి అడ్డుకోవాలని చూడటం న్యాయస్థానం ఆదేశాలను ధిక్కరించటమే అని మండిపడ్డారు. బారికేడ్లు అడ్డంపెట్టి పాదయాత్రకు ప్రజలు మద్దతు లేకుండా చేయాలనుకుంటున్న పోలీసు చర్యలను ఖండిస్తున్నట్లు తెలిపారు. తాడేపల్లి ఆదేశాలతో అమలయ్యే రాజారెడ్డి రాజ్యాంగాన్ని ప్రజలు ఉపేక్షించబోరని తేల్చిచెప్పారు. జగన్ రెడ్డి చేసిన పాదయాత్ర అధికారం కోసమైతే రైతులు రాష్ట్రం కోసం నిస్వార్థంగా పాదయాత్ర చేస్తున్నారని తెలిపారు. సంఘవిద్రోహ శక్తులను పోలీసుల ముసుగులో పంపి అడ్డుకోవాలని చూసే దుర్మార్గపు ఆలోచనలు ప్రభుత్వం మానుకోవాలని హితవు పలికారు. రైతుల ఉద్యమం ఆగాలంటే అమరావతిని ఏకైక రాజధానిగా ప్రకటించాల్సిందే అని స్పష్టం చేశారు.