మజ్లిస్ ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీ ఎన్టీఆర్‌పై చేసిన వ్యాఖ్యలకు నిరసనగా.. ఎన్టీఆర్ ఘాట్‌ను తెదేపా తెలుగు యువత నాయకులు పాలతో శుద్ధి చేశారు. ఎన్టీఆర్ ఘాట్ కూల్చివేస్తామని మజ్లిస్ నేతలు చేసిన వ్యాఖ్యలపై మండిపడ్డారు.
ఎన్టీఆర్ ఘాట్‌ను పాలతో శుద్ధి చేసిన తెలుగు యువత - TDP Fires On Akbaruddin Owaisi Comments
మజ్లిస్ ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీ ఎన్టీఆర్‌పై చేసిన కామెంట్లకు తెదేపా తెలుగు యువత మండిపడ్డారు. రాజకీయాలు నీ గల్లీలో చూసుకోమని హితవు పలికారు. ఎన్నికల సమయంలో చిల్లరగా ప్రవర్తించవద్దని సూచించారు. వ్యాఖ్యలు చేసినందుకు అతనిపై కఠిన చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ఎన్నికల సంఘం, మానవ హక్కుల సంఘాన్ని కోరారు.
రాష్ట్రంలో అసలు ఆ సంఘాలు ఉన్నాయా?
తక్షణమే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. కేంద్రంలో ఉన్న భాజపా ప్రభుత్వం ఎన్టీఆర్‌కు భారతరత్న ఇచ్చిన తర్వాతనే ఎన్టీఆర్ ఘాట్‌కు రావాలని కోరారు. రాష్ట్రంలో అసలు ఎన్నికల సంఘం, మానవ హక్కుల సంఘం ఉందా అని ప్రశ్నించారు. తక్షణమే వారిపై చర్యలు తీసుకోవాలని కోరారు.