ఆంధ్రప్రదేశ్‌లో.. విజయవాడ తెలుగుదేశం పార్టీలో విభేదాలు మరోసారి భగ్గుమన్నాయి. పార్టీ అధినేత చంద్రబాబు పర్యటనపై ఎంపీ కేశినేని నాని తమకు కనీస సమాచారం ఇవ్వకుండా ఒంటెద్దు పోకడలతో వ్యవహరిస్తున్నారంటూ పొలిట్‌బ్యూరో సభ్యులు బొండా ఉమా, ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న, అధికార ప్రతినిధి నాగుల్‌మీరా తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు.
ఎంపీ కేశినేని నానిపై తెదేపా నేతల ఆగ్రహం - కేశినేని నాని తాజా వార్తలు
ఏపీలో విజయవాడ తెలుగుదేశం పార్టీలో విభేదాలు భగ్గుమన్నాయి. ఎంపీ కేశినేని నానిపై బొండా ఉమా, బుద్ధ వెంకన్న, నాగుల్‌మీరా ఆగ్రహం వ్యక్తం చేశారు. కేశినేని నాని ఒంటెద్దు పోకడలతో వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. కేశినేని ఆధ్వర్వంలో జరిగే కార్యక్రమంలో తాము పాల్గొనబోమని ప్రకటించారు.
విజయవాడ తెదేపా, ఎంపీ కేశినేని నాని
కేశినేని నాని ఆధ్వర్వంలో జరిగే కార్యక్రమంలో తాము పాల్గొనబోమంటూ తిరుగుబాటు ప్రకటించారు. పార్టీకి తాము మాత్రమే విధేయులమని, పదవులకోసం అధిష్ఠానాన్ని బ్లాక్మెయిల్ చేస్తున్న నాని... తమను తక్కువ చేసి చూస్తున్నారని ధ్వజమెత్తారు.