పీఎస్‌ఎల్‌వీ సీ-51 రాకెట్ ప్రయోగం విజయవంతం కావటంపై ఇస్రో శాస్త్రవేత్తలకు తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు, జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ శుభాకాంక్షలు తెలిపారు. ఇస్రో మరో ఘనత సాధించిందని చంద్రబాబు అన్నారు. పీఎస్‌ఎల్‌వీ సీ-51 అంతరిక్ష పరిశోధన రంగంలో భారత దేశ ప్రతిష్టను చాటి చెప్పిందని కొనియాడారు. శాస్త్రవేత్తలకు శుభాభినందనలు తెలిపారు.
ఇస్రో శాస్త్రవేత్తలకు అభినందనలు: చంద్రబాబు, లోకేశ్ - pslv c-51 rocket launch news
పీఎస్‌ఎల్‌వీ సీ-51 రాకెట్ ప్రయోగం విజయవంతమైనందుకు ఇస్రో శాస్త్రవేత్తలకు తెదేపా అధినేత చంద్రబాబు, ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్ అభినందనలు తెలిపారు. ఇస్రో మరో ఘనత సాధించిందని కొనియాడారు.
ఇస్రో శాస్త్రవేత్తలకు అభినందనలు: చంద్రబాబు, లోకేశ్
నింగిని శాసించే స్థాయికి ఎదుగుతున్న శ్రీహరికోట అంతరిక్ష కేంద్ర శాస్త్రవేత్తలకు లోకేశ్ అభినందనలు తెలిపారు. ఈ విజయంతో ఇస్రో ట్రేడ్ మార్క్‌లా మారటం దేశానికే గర్వకారణమన్నారు.
ఇదీ చదవండి:పీఎస్‌ఎల్‌వీ-సీ51 రాకెట్ ప్రయోగం విజయవంతం