విజయవాడలోని ప్రసాదంపాడు ఎక్సైజ్ శాఖ కార్యాలయం వద్ద ఉద్రిక్తత నెలకొంది. జంగారెడ్డిగూడెం కల్తీ మద్యం మరణాలపై విచారణ చేపట్టాలని, దోషులను శిక్షించాలంటూ ఎక్సైజ్ కమిషనర్‌కు వినతిపత్రం సమర్పించేందుకు వచ్చిన తెదేపా ఎమ్మెల్యేలకు, పోలీసులకు మధ్య వాగ్వాదం జరిగింది. అనంతరం తెదేపా ఎమ్మెల్యేలు అచ్చెన్నాయుడుతో సహా మరికొందరు నేతలను పోలీసులు అరెస్టు చేసి... ఉంగుటూరు, కంకిపాడు పోలీస్ స్టేషన్‌కు తరలించారు.
అరెస్టులతో ఉద్యమాన్ని ఆపలేరు..
నాటుసారా మరణాలపై ఎక్సైజ్ కమిషనర్‌కు వినతిపత్రం ఇచ్చేందుకు వస్తే అరెస్టు చేస్తారా? అని తెదేపా నేతలు ప్రశ్నించారు. అరెస్టులతో ప్రజాఉద్యమాన్ని ఆపలేరని నేతలు మండిపడ్డారు. శాంతియుతంగా నిరసన తెలిపితే.. అడ్డుకోవటం దారుణమన్నారు.