తెలంగాణ ఉద్యమంలో ఆర్టీసీ కార్మికులను ఉద్యమకారులుగా కీర్తించిన ముఖ్యమంత్రి కేసీఆర్... ఇవాళ వారిపైనే కక్ష కట్టారని తెలంగాణ తెలుగుదేశం పార్టీ ఆరోపించింది. సమ్మె నోటీసుపై ప్రభుత్వ అలసత్వం వల్లే ఆర్టీసీ కార్మికులు సమ్మెకు దిగారని ఆ పార్టీ సీనియర్ నేత రావుల చంద్రశేఖర్ అన్నారు. భేషజాలకు పోకుండా సమస్య పరిష్కారానికి ప్రభుత్వం కృషి చేయాలని సూచించారు. కార్మిక కుటుంబాలను, లక్షలాది మంది ప్రయాణికులను ఇబ్బందికి గురిచేయవద్దని హితవు పలికారు.
ఆర్టీసీ సమ్మెను జటిలం చేయొద్దు : రావుల
ఆర్టీసీ కార్మికుల సమ్మెను జటిలం చేయవద్దని తెతెదేపా నేత రావుల చంద్రశేఖర్ సూచించారు. కార్మికుల సమస్య పరిష్కారానికి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
ravula chandrashekhar