తెలంగాణ

telangana

ETV Bharat / city

PATTABHI: 'అందుకే కొన్నిరోజులు బయటకు వెళ్లా..' - తెదేపా నేత పట్టాభారామ్‌ వీడియో విడుదల

వైకాపా నేతలు తన ఇంటిపై దాడి చేయడంతో తన చిన్నకుమార్తె షాక్‌కు గురైందని తెలుగుదేశం అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్‌ తెలిపారు. గాయపడిన పసిహృదయాన్ని తిరిగి మామూలు స్థితికి తెచ్చేందుకు బాధ్యతగల తండ్రిగా వ్యవహరించానని చెప్పారు.

TDP LEADER PATTABHI
TDP LEADER PATTABHI

By

Published : Oct 26, 2021, 7:10 PM IST

వైకాపా నేతలు తన ఇంటిపై దాడి చేయడంతో తన చిన్నకుమార్తె షాక్‌కు గురైందని.. అందుకే కొన్నిరోజులు బయటకు వెళ్లినట్లు తెలుగుదేశం అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్‌ తెలిపారు. గాయపడిన పసిహృదయాన్ని తిరిగి మామూలు స్థితికి తెచ్చేందుకు బాధ్యతగల తండ్రిగా వ్యవహరించానని చెప్పారు. దీనిపై కొందరు విపరీత అర్థాలు తీయడం తగదని హితవు పలికారు.

ఏపీలో మాదకద్రవ్యాలకు వ్యతిరేకంగా మా పోరాటం కొనసాగుతుందని.. డ్రగ్స్​కు వ్యతిరేకంగా జరిగే పోరాటంలో త్వరలోనే క్రియాశీలకంగా పాల్గొంటానన్నారు. ఈ మేరకు ఓ వీడియోను విడుదల చేశారు. తన ప్రశ్నలకు సమాధానం చెప్పలేకే దాడులకు తెగబడ్డారని పట్టాభిరామ్‌ అన్నారు.

PATTABHI: 'అందుకే కొన్నిరోజులు బయటకు వెళ్లా..'

ఇదీచూడండి:Samantha Defamation Suit: సమంతకు సంబంధిత వీడియోలు తొలగించాలని కోర్టు ఆదేశం

ABOUT THE AUTHOR

...view details