ఆంధ్రప్రదేశ్లోని తిరుపతి పార్లమెంట్ స్థానానికి జరిగే ఉప ఎన్నికకు ఈ నెల 24న నామినేషన్ దాఖలు చేయనున్నట్లు తెదేపా అభ్యర్థి పనబాక లక్ష్మీ తెలిపారు. ఉప ఎన్నికలో గెలిపిస్తే తిరుపతి వాణిని వినిపిస్తానని అన్నారు. నెల్లూరు జిల్లా వెంకటగిరిలో తెదేపా నియోజకవర్గ విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి పనబాక లక్ష్మీతోపాటు మాజీ మంత్రులు యనమల రామకృష్ణుడు, సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, అమర్నాథ్ రెడ్డి హాజరయ్యారు.
'గెలిపిస్తే తిరుపతి వాణిని వినిపిస్తా' - పనబాక లక్ష్మీ
ఉపఎన్నికల్లో తనని గెలిపిస్తే తిరుపతి వాణిని పార్లమెంట్లో వినిపిస్తానని కేంద్ర మాజీ మంత్రి పనబాక లక్ష్మీ అన్నారు. ఈ నెల 24న నామినేషన్ దాఖలు చేయనున్నట్లు తెలిపారు.
'గెలిపిస్తే తిరుపతి వాణిని వినిపిస్తా'
ఈ సందర్భంగా మాట్లాడిన యనమల.. రాష్ట్రాన్ని దోచుకునే పనిలో సీఎం జగన్ ఉన్నారని విమర్శించారు. జైలు జీవితం గడిపిన ఆయన.. అందర్నీ జైలుకు పంపాలనే పనిలో ఉన్నారని దుయ్యబట్టారు. రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రైవేటు లిమిటెడ్గా మార్చేందుకు జగన్ కంకణం కట్టుకున్నారని సోమిరెడ్డి ఆరోపించారు. విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణ జరుగుతుంటే.. జగన్మోహన్ రెడ్డి ఏం చేస్తున్నారని ప్రశ్నించారు.
ఇదీ చదవండి :'డబ్బు, అధికార బలంతోనే తెరాస గెలుపు'