తెలంగాణ

telangana

ETV Bharat / city

వైకాపా దిగజారుడు రాజకీయాలు మానుకోవాలి: నారా లోకేశ్ - సీఎం జగన్​పై నారా లోకేశ్​ ఆగ్రహం

Nara Lokesh on attack on Anna canteen ఏపీలోని చిత్తూరు జిల్లా కుప్పంలో అన్న క్యాంటీన్‌ ధ్వంసం, ఫ్లెక్సీల చించివేతపై తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ తీవ్రస్థాయిలో స్పందించారు. అన్న క్యాంటీన్లపై దాడి జగన్ రాజకీయ దిగజారుడుతనానికి నిదర్శనమని విమర్శించారు. ఎన్ని ఇబ్బందులు పెట్టినా అన్న క్యాంటీన్లను నిర్వహించి తీరతామని స్పష్టం చేశారు. అన్న క్యాంటీన్‌పై దాడి చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

Nara Lokesh
నారా లోకేశ్​

By

Published : Aug 30, 2022, 6:12 PM IST

Nara Lokesh on attack on Anna canteen: తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో కుప్పంలో నిర్వహిస్తున్న అన్న క్యాంటీన్లపై దాడి సీఎం జగన్ రెడ్డి రాజకీయ దిగజారుడుతనానికి నిదర్శనం అని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ధ్వజమెత్తారు. ఆంధ్రప్రదేశ్​ రాష్ట్రంలోని చిత్తూరు జిల్లా కుప్పం ఆర్టీసీ బస్టాండ్ కూడలి వద్ద 86 రోజులుగా నిర్వహిస్తున్న అన్న క్యాంటీన్​పై వైకాపా వారు అర్ధరాత్రి దాడి చేసి ధ్వంసం చేయడాన్ని తీవ్రంగా ఖండించారు. అధికారంలోకి రాగానే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 201 అన్న క్యాంటీన్లను సీఎం జగన్​ రద్దు చేశారని, పేద వాడి నోటి దగ్గర కూడు లాక్కుంటున్నారని మండిపడ్డారు. ఎన్ని ఇబ్బందులు పెట్టినా అన్న క్యాంటీన్లు నిర్వహించి తీరుతామని తేల్చిచెప్పారు. కుప్పంలోని అన్న క్యాంటీన్​పై దాడి చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్​ డిమాండ్ చేశారు.

"అన్న క్యాంటీన్లపై దాడి జగన్‌ రాజకీయ దిగజారుడుతనానికి నిదర్శనం. కుప్పం ఆర్టీసీ బస్టాండ్ కూడలి వద్ద 86 రోజులుగా నిర్వహిస్తున్నారు. అర్ధరాత్రి వైకాపా నాయకులు దాడిచేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నా. అధికారంలోకి రాగానే రాష్ట్రంలో 201 అన్న క్యాంటీన్లు రద్దు చేశారు. ఇప్పుడు పేద వాడి నోటి వద్ద కూడు లాక్కుంటున్నారు. ఎన్ని ఇబ్బందులు పెట్టినా అన్న క్యాంటీన్లు నిర్వహించి తీరుతాం. కుప్పంలోని క్యాంటీన్‌పై దాడిచేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి." -నారా లోకేశ్​, తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి

ఇదీ జరిగింది:ఏపీలోనిచిత్తూరు జిల్లా కుప్పం పట్టణంలో తెదేపా ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న అన్న క్యాంటీన్‌ను గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేశారు. కుప్పం ఆర్టీసీ బస్టాండ్‌ కూడలి వద్ద ఏర్పాటు చేసిన తాత్కాలిక క్యాంటీన్‌పై సోమవారం అర్ధరాత్రి దాడి చేశారు. అక్కడ ఎన్టీఆర్‌ విగ్రహం వద్ద బ్యానర్లను చించేశారు. షామియానాను చించి ధ్వంసం చేశారు.

ఇటీవల తెదేపా అధినేత చంద్రబాబు కుప్పం పర్యటన సందర్భంగా వైకాపా-తెదేపా వర్గాల మధ్య ఘర్షణ పూరిత వాతావరణం నెలకొన్న సంగతి తెలిసిందే. వైకాపా శ్రేణులు పట్టణంలో ర్యాలీ నిర్వహించిన సందర్భంలో అన్న క్యాంటీన్‌ను ధ్వంసం చేశారు. మళ్లీ దాన్ని పునరుద్ధరించగా ఇప్పుడు దుండగులు మరో సారి దాడి చేశారు. మరోవైపు కుప్పం పట్టణంలో ఆర్‌అండ్‌బీ గెస్ట్‌హౌస్‌ వద్ద చంద్రబాబు ఫ్లెక్సీని గుర్తుతెలియని వ్యక్తులు ధ్వంసం చేశారు.

ఏఆర్​ కానిస్టేబుల్​ డిస్మిస్​పై నారా లోకేశ్​:నిరంకుశ ప్రభుత్వంపై పోరాడిన కానిస్టేబుల్ ప్రకాశ్‌ను నారా లోకేశ్​ ప్రశంసించారు. సేవ్‌ ఏపీ పోలీస్‌ అనే అధికారం ఎస్సీ కానిస్టేబుల్‌కు లేదా అని అన్నారు. రాష్ట్రంలో ఎస్సీలపై దమనకాండ కొనసాగుతోందని ధ్వజమెత్తారు. కానిస్టేబుల్ ప్రకాశ్ ఉదంతమే అందుకు ఉదాహరణ అన్నారు. పోలీసులకు రావాల్సిన బకాయిల గురించి మాట్లాడితే వేటు వేస్తారా? అని ప్రశ్నించారు. కానిస్టేబుల్ ప్రకాశ్‌ను విధుల్లోకి తీసుకోవాలని నారా లోకేశ్ డిమాండ్​ చేశారు. పోలీసుల పెండింగ్‌ బకాయిలు విడుదల చేయాలన్నారు.

నిరంకుశ ప్రభుత్వంపై పోరాడిన కానిస్టేబుల్ ప్రకాశ్‌కు హ్యాట్సఫ్. సేవ్‌ ఏపీ పోలీస్‌ అనే అధికారం ఎస్సీ కానిస్టేబుల్‌కు లేదా?. రాష్ట్రంలో ఎస్సీలపై దమనకాండ కొనసాగుతోంది. కానిస్టేబుల్ ప్రకాశ్ ఉదంతమే అందుకు ఉదాహరణ. పోలీసులకు రావాల్సిన బకాయిల గురించి మాట్లాడితే వేటు వేస్తారా?. కానిస్టేబుల్ ప్రకాశ్‌ను విధుల్లోకి తీసుకోవాలి. పోలీసుల పెండింగ్‌ బకాయిలు విడుదల చేయాలి."-నారా లోకేశ్

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details