TDP Leader Nara Lokesh: ప్రజల ప్రాణాలకంటే తమకు ఏదీ ఎక్కువ కాదని.. ప్రజా సమస్యలపై నిరంతరం పోరాడతూనే ఉంటామని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్ స్పష్టంచేశారు. జంగారెడ్డిగూడెం కల్తీ మరణాలు సహా అన్ని విషయాల్లోనూ ఏపీ సీఎం జగన్ నవ్వుతూ... అబద్దాలు ఆడేస్తున్నారని లోకేశ్ దుయ్యబట్టారు. తెదేపా హయాంలో డీఎస్పీల ప్రమోషన్ల విషయంలోనూ రాష్ట్రపతికే ఫిర్యాదు చేశారని.. రాష్ట్రపతి, ప్రధానిలకే అబద్దాలు చెప్పగలిగిన ఘనుడు జగన్ అని ధ్వజమెత్తారు. ఈ మేరకు రాష్ట్ర రాజకీయాలపై మీడియాతో లోకేశ్ చిట్‌చాట్ నిర్వహించారు.
ప్రజల ప్రాణాలంటే జగన్‌కు ఎంత లోకువో..
జంగారెడ్డిగూడెం మరణాలపై నాలుగు రోజులపాటు సాగదీస్తున్నారంటూ.. ప్రభుత్వం విమర్శలు అర్ధరహితమని మండిపడ్డారు. పేదల ప్రాణాలంటే జగనుకు ఎంత లోకువో జంగారెడ్డిగూడెం ఘటనతో స్పష్టమైందని ఆగ్రహం వ్యక్తం చేశారు. అవి సహజ మరణాలైతే ఎఫ్ఐఆర్లు ఎందుకు నమోదు చేశారు.. సారా బట్టీలపై ఎస్ఈబీ దాడులు ఎందుకు అని నిలదీశారు.
ఒకే రాష్ట్రం.. ఒకే రాజధాని తమ విధానం